Skip to main content

Bogus Certificates : గురుకులాల్లో ప్ర‌వేశాల‌కు బోగ‌స్ స‌ర్టిఫికెట్లు.. దుష్ప్ర‌చారాల‌పై స్పంద‌న‌..

Bogus certificates for gurukul schools admissions  Gurukul schools in Telangana facing bogus certificate challenges for student admissions

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ‌ రాష్ట్రంలోని గురుకుల పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు అడ్మిష‌న్లు క‌ల్పించేందుకు పలు ట్యుటోరియల్స్‌, గుర్తింపులేని పేరెంట్‌ సంఘాలు బోగస్‌ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారని, దీంతో గురుకుల అడ్మిషన్లను పక్కదారి పట్టిస్తున్నాయని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి వ్య‌క్తం చేశారు. 

మ‌రింత పెరిగాయి..

బోగ‌స్ స‌ర్టిఫికెట్ల కార‌ణంగా, ఈ ఏటా ప్ర‌వేశాల సంఖ్య కూడా త‌గ్గింద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె స్పందిస్తూ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గురుకులాల్లో ప్రవేశం పొందేందుకు ముఖ్యంగా కుల, ఆదాయ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు ప్రాథమిక ప్రామాణికమని వివరించారు. కానీ, కొన్ని ట్యుటోరియల్స్‌, గుర్తింపులేని పేరెంట్‌ సంఘాలు బోగస్‌ సర్టిఫికెట్లు సృష్టించడంతో.. సీటు ఇప్పిస్తామని రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు అక్రమాలకు పాల్పడ్డాయని పేర్కొన్నారు.

Model Schools Admissions 2025 : తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం!

అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో బోగస్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న పలు ట్యుటోరియల్స్‌ మూతబడ్డాయని కూడా ఆమె ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. అలాంటి వారే ఇప్పుడు దరఖాస్తులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అది అవాస్తమని, ఈ ఏడాది దరఖాస్తులు పెరిగాయని వర్షిణి వెల్లడించారు. ఇలా, దుష్ప్ర‌చారాలు జ‌రిపితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చిరించారు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Feb 2025 10:53AM

Photo Stories