Skip to main content

AP Tenth Class Time Table 2024-25 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్‌లో స్వల్ప మార్పు ఇదే...! మార్చి 17వ తేదీ నుంచి...

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా విడుద‌ల చేశారు.
AP Tenth Class Time Table 2024-25

అయితే ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. మార్చి నెలలో పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 

మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు...
సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

➤☛ Tenth Class Pre Final Exams Time Table 2025 : టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుద‌ల‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

మార్చి 31వ తేదీన రంజాన్‌ సెలవు దినంగా ప్రభుత్వ కేలండర్‌లో ఉంది. నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్‌ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండగ వస్తే ఏప్రిల్‌ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ టెన్త్ 2024 పబ్లిక పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే 2025...
➤☛ మార్చి 17, 2025 (సోమవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1 పరీక్ష
➤☛ మార్చి 19, 2025 (బుధవారం) సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్ష
➤☛ మార్చి 21, 2025 (సోమవారం) ఇంగ్లిష్‌ పరీక్ష
➤☛ మార్చి 22, 2025 (శుక్రవారం) ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌ 2, OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
➤☛ మార్చి 24, 2025 (సోమవారం) మ్యాథమెటిక్స్‌ పరీక్ష
➤☛ మార్చి 26, 2025 (బుధవారం) ఫిజికల్‌ సైన్స్ పరీక్ష
➤☛ మార్చి 28, 2025 (శుక్రవారం) బయోలాజికల్‌ సైన్స్‌ పరీక్ష
➤☛ మార్చి 29, 2025 (శనివారం) OSSC మెయిన్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్ 2, SSC ఒకేషన్‌ కోర్సు
➤☛ మార్చి 31 లేదా ఏప్రిల్ 1, 2025 (సోమవారం లేదా మంగళవారం) సోషల్‌ స్టడీస్‌ పరీక్ష

చదవండి: AP& TS Tenth Class :  మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

Published date : 25 Jan 2025 08:52AM

Photo Stories