Authorities Negligence : పరీక్షల ప్రారంభంలోనే నిర్లక్ష్యం.. ఆందోళనలో విద్యార్థులు..

సాక్షి ఎడ్యుకేషన్: ఏపీలో టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమైయ్యాయి. పరీక్షల కోసం ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాల్లో సీసీటీవీ, విద్యార్థులకు కావాల్సిన ప్రతీ వసతిని ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏర్పాటు చేసిన ప్రతీ సమావేశాల్లో చెప్పుకుంటూ వచ్చారు అధికారులు. ఏర్పాటుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు కూడా. కానీ, నేటి నుంచే ప్రారంభం అయిన వార్షిక పరీక్షలకు ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో అధికారులు వారి నిర్లక్ష్యాన్ని చాటారు.
ఆందోళనలో విద్యార్థులు..
ఏపీలోని అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో కూడా పరీక్షలకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం పరీక్ష కోసం విద్యార్థులు వచ్చినప్పుడు తరగతి గదిలో వారికి సెమెంట్ సంచులు కనిపించాయి. అవి చాలా ఉండడంతో బెంచీలు క్రమంగా లేవు. దీంతో, అధికారులు ఇప్పటికప్పుడే వాటిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు. కానీ, ఈ కారణంగా విద్యార్థులు పరీక్షకు ఆలస్యం అవుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు.
QS Rankings 2025 for BTech : క్యూఎస్-2025 ప్రకారం భారత్ అమెరికాలో సీఎస్ఈకి బెస్ట్ ఇవే..
పరీక్ష ఆలస్యమైతే అదనపు సమయం కేటాయిస్తారా.. లేదా అనే అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సంఘటనతో పై అధికారులు తీవ్ర విమశ్రలు కురిపిస్తూ, వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించగా.. హడావిడిగా ఆ పనిలో పడ్డారు అక్కడి బృందం.
కఠినమైన చర్యలు తప్పవు..
పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ఎంత సమయం ఇచ్చారు..! ఇప్పటివరకు ఏం చేస్తున్నారు.. అని నిలదీశారు. విద్యార్థులకు ప్రారంభంలోని ఇలా ఆందోళనకు గురిచేసేలా ఏర్పాట్లు ఉంటే ప్రతీ పరీక్షకు వారు ఆందోళన పెరగదా.. అంటూ అధికారులు సిబ్బందిని నిలదీశారు. ఇకపై ఎలాంటి లోటు కనిపించినా, విద్యార్థులకు ఇబ్బంది కలిగినా కఠినమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap tenth board exams 2025
- Exam Arrangements
- amalapuram govt girls school
- authorities negligence
- lack of arrangements
- students tension for exam
- exam centers arrangements
- warning for authorities
- AP Amalapuram Govt Girls School
- exam center arrangements for ap tenth board 2025
- ap board exams timings
- ap tenth board 2025 latest updates
- confusion and negligence in arrangements
- ap ssc centers arrangements
- Education News
- Sakshi Education News