Skip to main content

Gurukul Admissions : గురుకుల విద్యాల‌యాల్లో ఖాళీలు.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే..!!

గురుకుల విద్య‌ను పొందేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌..
Application Process for Telangana Minority Gurukul College Admissions   Gurukul admissions 2024 for fifth and inter students  Telangana Gurukul College Academic Year 2024-2025 Notification

సాక్షి ఎడ్యుకేష‌న్: సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు రోడ్డులో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో 2024-2025 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం ఇంటర్‌ ఎం.పి.సి, బై.పీ.సీ ఇంగ్లీష్ మీడియం మొదటి ఏడాదిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు క‌ళాశాల యాజ‌మాన్యం. ఈ మెర‌కు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ కె.వెంకట రామయ్య ప్ర‌క‌టించారు. ప్ర‌వేశాలు, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు..

AP Schools System Changes : ఇక‌పై పాత పద్ధతిలోనే స్కూళ్లు.. పలు మార్పులు ఇవే...!

ఖాళీలు ఇవే..

గురుకుల క‌ళాశాల‌లో 5వ తరగతిలో 80 సీట్లకు గాను 75% మైనారిటీలకు, 25% నాన్ మైనారిటీ (ఎస్సి, ఎస్టి, బిసి, ఓసి) లకు ఖాళీలు ఉన్నాయి. అయితే, ఇంటర్ మొదటి సంవత్సరం ఎం.పి.సి, బై.పీ.సీ లలో 80 సీట్లకు గాను 75% మైనారిటీలకు, 25%నాన్ మైనారిటీ (ఎస్సి, ఎస్టి, బిసి, ఓసి) లకు ఖాళీలు కలవు. పైన తెలిపిన తరగతలలో గల ఖాళీలే కాకుండా ఇంటర్ 2వ సంవత్సరం 6, 7, 8 వ తరగతి లో గత సంవత్సరం మిగిలిన మైనారిటీ ,నాన్ మైనారిటీ సీట్లను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

Gurukul Admission Notification 2025 : వివిధ‌ గురుకులాల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు వివ‌రాలు ఇవే..

ముఖ్య‌మైన వివ‌రాలు..

క‌ళాశాల‌ల్లో ఖాళీగా ఉన్న సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు 18-01-2025 నుంచి 28-2-2025 వరకు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ లో వివరాల నమోదు కోసం ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 ని.ల. వరకు కళాశాల నందు ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించలని, ప్రిన్సిపాల్.కె. వెంకట్రామయ్య కోరారు. ఆన్‌లైన్ ద‌రఖాస్తుల కోసం tmreis.cgg.gov.in website, https://tmreis.telangana.gov.in సంద‌ర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, TMREIS app నందు కానీ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. మరిన్ని వివరాలకు కోసం సెల్ 73311 70864, 8328 111 525 సంప్రదించాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Jan 2025 03:27PM

Photo Stories