Teachers Struggles : 60 శాతం కూడా పూర్తికాని సిలబస్.. అధ్యాపకుల విధులు ఇలా!
ఒంగోలు సిటీ: మరుగుదొడ్లు శుభ్రం చేశారా? లేదా? వాటి పరిస్థితి ఎలా ఉంది. మధ్యాహ్న భోజన వంటకాలు, విద్యార్థులకు వడ్డిస్తున్న ఫొటోలు పంపడం..వన్ నేషన్..వన్ కార్డు (అపార్)లో విద్యార్థుల వివరాల నమోదు.. ఇవీ ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులతో చేయిస్తున్న పనులు. పాఠాలు చెప్పాల్సిన అయ్యోర్లు ఈ పనులతో బిజీగా ఉండడంతో చదువులు అటకెక్కుతున్నాయి. ఈ పాటికే ఉన్నత పాఠశాలల్లో సిలబస్ 90 శాతం పూర్తి చేసి డిసెంబర్ నుంచి రివిజన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిల్లాలో 60 శాతం సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది.
AP Inter 2025 Exams Fee: పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!
జిల్లాలో 3104 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 3,75,757 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 14,500 మంది ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేయాల్సిన టీచర్లకు పలు రకాల యాప్‌ల కష్టాలతో చదువులు చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు సబ్జెక్ట్ టీచర్ల కొరతతో విద్యార్థుల పరిస్థితి అగమ్యంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి తదితర నియోజకవర్గాల్లో టీచర్ల కొరతతో సిలబస్ ముందుకు సాగడం లేదు. ఇవి చాలవన్నట్టు వివిధ రకాల శిక్షణ తరగతులతో ఉపాధ్యాయులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులకు మరింత కష్టాలు పెరిగాయని వివిధ ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఉపాధ్యాయుడు పాఠశాలలోకి వచ్చిన వెంటనే ఫేషియల్ అటెండెనెన్స్, విద్యార్థుల హాజరుకు సంబంధించి వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. విద్యార్థుల హాజరును ఉదయం 9.30 లోపు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే ఆలస్యంగా వచ్చిన వారి వివరాలు యాప్‌లో నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇది ముగిసిన తర్వాత మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. ప్రతి రోజూ ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి వారు ఆ రోజు తీసుకుంటున్న పిరియడ్ల వివరాలను మూడుసార్లు ఆయా పాఠశాల హెచ్‌ఎంలు ‘టీచ్‌టూల్ యాప్’ లో నయోదు చేయాల్సి ఉంటుంది.
Job Recruitment: ఇంజనీర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్.. జీతం రూ.25వేలు
అలాగే విద్యార్థుల అసెస్‌మెంట్ టెస్ట్ మార్కులను ప్రతి తరగతి ఉపాధ్యాయుడు ‘ఫేషియల్ అటెండెన్స్’యాప్‌లో ఎంటర్ చేయాలి. ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఐఎంఎంఎస్ యాప్‌లో గుడ్లు, చిక్కీస్, భోజనం వడ్డింపు తదితర వివరాలను అప్‌లోడ్ చేయాలి. క్రీడలకు సంబంధించి అకడమిక్ మానిటరింగ్ యాప్‌లో ఆటల పోటీల వివరాలను నమోదు చేయాలి. చాలా సందర్భాల్లో సర్వర్, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
టీచర్లతో మరుగుదొడ్ల ఫొటోలా..
ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 1 గంట, రెండు గంటలకు మరుగుదొడ్లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫొటోలను సమీప సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్, స్కూలు అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే వారు దీనికి దూరంగా ఉండడంతో ఉపాధ్యాయులే ఈ పనిని చేస్తున్నారు. ఆయాలతో పనిచేయించుకుంటున్నారే గానీ వారికి సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి జిల్లాలో నెలకొంది.
Cyber Crimes : నయా పద్ధతులతో సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్తలు తప్పనసరి అంటున్న పోలీసులు
శిక్షణలతో పాఠాలకు దూరం..
వివిధ రకాల శిక్షణ తరగతులతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల మొక్కుబడిగా పాఠాలు చెబుతూ మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 10వ తరగతి వారికి డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రారంభించాల్సి ఉంది. అలాగే పబ్లిక్ పరీక్షలకు ముందస్తు ప్రణాళికను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఆ పరిస్థితి లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 60 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదు. నెలరోజుల్లో సిలబస్ పూర్తి అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. సిలబస్ పూర్తి చేసి చదువుల్లో వెనుబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించే పరిస్థితి కూడా కనిపించడంలేదు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అపార్ కష్టాలెన్నో..
వన్ నేషన్..వన్ కార్డు పేరుతో కేంద్రం ప్రవేశపెట్టిన అపార్ కార్డు జారీ ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధాయులు అవస్థల పాలవుతున్నారు. తొలుత 9, 10 తరగతుల వారికే అని చెప్పారు. ఆ తర్వాత 1వ తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యార్థుల అపార్ ఐడీ జనరేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆధార్ వివరాలు, స్కూలు రికార్డ్స్‌లో ఉన్న వివరాలు తేడా ఉండడంతో అవస్థలు పడుతున్నారు. దీనికి పుట్టిన తేదీ సర్టిఫికెట్ తేవాలని చెబుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఆధార్ వివరాలు అప్‌డేట్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. దీంతో 50 శాతం కూడా ఐడీ జనరేట్ కావడంలేదు.