School holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు వరుసగా సెలవులు.. ఎందుకంటే!
Sakshi Education
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
School holidays Due To Heavy Rainfall Alert In andhra pradesh
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల25న వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈనెల 29న.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈనెల 26 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో వాతావరణ ప్రభావాన్ని బట్టి పాఠశాలలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.