Skip to main content

Extension of school holidays: భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు పొడిగింపు ఎన్ని రోజులంటే?

Extension of school holidays
Extension of school holidays

ఖమ్మం: భారీ వర్షాలు, వరదలు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈనెల 6 వరకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 7, 8న పబ్లిక్ హాలీడే ఉండటంతో సెప్టెంబర్ 9న తిరిగి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అయితే ఈ సెలవులు తెలంగాణ అంతటా కాదు.. కేవలం ఖమ్మం జిల్లా వరకే ప్రకటించారు.

Airport jobs news: ఇంటర్‌ అర్హతతో ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా ఉద్యోగాలు జీతం 45వేలు: Click Here

భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో జన జీవనం స్తంభించిపోయింది. ప్రస్తుతం వరుణుడు కొద్దిగా శాంతించటంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే.. భారీ వర్షాల కారణంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబ్ జిల్లాల్లో కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుతం వరుణుడు శాంతించటంతో వరద ముంపు నుంచి తేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు విద్యాంసంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులు మంజూరు చేయటం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 6 (శుక్రవారము) వరకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. ఇక సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 8న ఆదివారం కావటంతో విద్యా సంస్థలు సెప్టెంబర్ 9న తెరుచుకుంటాయని చెప్పారు.

అంటే నేటి నుంచి వరుసగా 5 రోజుల పాటు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి. అన్ని యాజమాన్య విద్యాసంస్థలు సెలవులను కచ్చితంగా పాటిస్తూ సదరు సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు విధిగా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రకటన జారీ చేశారు.

తేరుకుంటున్న ఖమ్మం
ఖమ్మం చరిత్రలో ఎన్నడు లేని విధంగా వచ్చిన మున్నేరు వరద అక్కడి ప్రజలను నిలువునా ముంచింది. భారీ వరదతో వందలాది ఇండ్లు ముంపునకు గురయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇండ్లల్లోకి మోకాళ్ల లోతు బురద చేరింది. వర్షాలు, వరద తగ్గటంతో ప్రజలు ఇండ్లల్లోని బురదను శుభ్రపరుచుకునే పనిలో పడ్డారు. అధికార యంత్రాంగం కూడా ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. పారిశుద్ధ్య, పోలీసులు, బెటాలియన్ సిబ్బందిని ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

 

Published date : 04 Sep 2024 04:33PM

Photo Stories