Skip to main content

District Court jobs: 10వ తరగతి ఉత్తీర్ణతతో తెలంగాణ జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్,టైపిస్ట్ ఉద్యోగాలు

Court jobs  Sangareddy Unit District Legal Services Authority notification for Steno Typist and Record Assistant vacancies
Court jobs

తెలంగాణ రాష్ట్రం లోని సంగారెడ్డి యూనిట్ , డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ లో రెగ్యులర్ ప్రాధిపతికన స్టెనో/ టైపిస్ట్ మరియు రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

Inter అర్హతతో తెలంగాణాలో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here

కేవలం 10 వ తరగతి ఉత్తీర్ణత తో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగానికి , డిగ్రీ అర్హత తో స్టేనో / టైపిస్ట్  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య – 02 

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 
స్టెనో/ టైపిస్ట్ -01
రికార్డు అసిస్టెంట్ -01

విద్యార్హత
స్టెనో/ టైపిస్ట్ :
గుర్తింపు పొందిన సంస్థ నుండి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ లో 120 ఇంగ్లీష్ పదాలను షార్ట్ హ్యాండ్ లో చేయగలగాలి.
నిముషానికి 45 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి , గవర్మెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి గుర్తింపు పొందాలి.
 కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.

 రికార్డు అసిస్టెంట్ : 
10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.

వయస్సు :
18 సంవత్సరాలు నిండి యుండి , 34 సంవత్సరాల లోపు వయస్సు వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు నిర్ధారణ కొరకు 01/09/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
Ex –  సర్విస్ మాన్ వారికి తెలంగాణ  ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.

దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ను సమర్పించాలి.
మార్క్స్ మెమోలు , పాస్ సర్టిఫికెట్లు , డేట్ ఆఫ్ బర్త్ , కాస్ట్ సర్టిఫికెట్ మొదలగునవి సెల్ఫ్ అటెస్ట్డ్ కాపీలు 2 జతలు దరఖాస్తు తో జత చేసి , 30 /- రూపాయల స్టాంప్ అతికించిన సెల్ఫ్ అడ్రసెడ్ ఎన్వలప్ తో ఆఫీస్ వారికి అందజేయాలి.

దరఖాస్తు చిరునామా: 
దరఖాస్తు ను నేరుగా ఇవ్వరాదు.
క్రింద తెలిపిన చిరునామాకు అప్లికేషన్ ను రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా చెరవేయాలి.
దరఖాస్తు ఎన్వలప్ పై Application for the post of ____________________ అని రాయాలి.
CHAIRMAN , DISTRICT LEGAL SERVICES AUTHORITY , NYAYA SEVA SADAN , DISTRICT COURT PREMISES , SANGAREDDY అడ్రస్ కి పంపించాలి.

అప్లికేషన్ ఫీజు :  
OC, BC అభ్యర్థులు 800/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 400/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో The secretary , district legal services authority ,sangareddy “ payable at sangareddy పేరు మీదు గా చెల్లించాలి.

ఎంపిక విధానం :

1)స్టెనో / టైపిస్ట్:

స్టెనో / టైపిస్ట్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ , ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వ్రాత పరీక్ష కి 40 మార్కులు , స్కిల్ టెస్ట్ కి 40 మార్కులు ,ఇంటర్వ్యూ కి 20 మార్కులు కేటాయించారు.
వ్రాత పరీక్ష లో జనరల్ నాలెడ్జ్ 20 మార్కులు , జనరల్ ఇంగ్లిష్ 20 మార్కులు మొత్తం 40 మార్కులకు గాను 45 నిముషాలు కేటాయించారు.

2) రికార్డు అసిస్టెంట్: 
రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వ్రాత పరీక్ష కి 80 మార్కులు , ఇంటర్వ్యూ కి 20 మార్కులు కేటాయించారు.
వ్రాత పరీక్ష లో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ వుంటాయి. 90 నిముషాలలో పరీక్ష పూర్తి చేయాలి.

ముఖ్యమైన అంశాలు : 

వ్రాత పరీక్ష తేది తేది 21/12/2024 ఉదయం 10:30 , డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ సంగారెడ్డి నందు జరుగును.

ముఖ్యమైన తేదిలు:
నోటిఫికేషన్ విడుదల తేది : 12/11/2024
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 13/11/2024
దరఖాస్తు చేయడానికి చివరి తేది : 7/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా)


👉  Click Here For Notification

👉 Official WebsiteClick Here

Published date : 06 Dec 2024 10:16AM

Photo Stories