Organic Exports: దేశంలో తగ్గిన సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు
Sakshi Education
భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 2020-21 నుంచి భారీగా తగ్గాయి.

దీనికి సంబంధించిన ఆధారాన్ని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ సేంద్రియ ఉత్పత్తుల కార్యక్రమం (ఎన్‌పీఓపీ) కింద వీటి ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. కానీ, 5 ఏళ్ల కింద గరిష్టంగా రూ.7,078 కోట్ల విలువైన 8.88 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను మనదేశం ఎగుమతి చేసింది. ఆ తరవాత ఈ ఎగుమతులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
సంవత్సరం | ఎగుమతుల పరిమాణం (లక్షల టన్నుల్లో) |
విలువ (రూ. కోట్లలో) |
---|---|---|
2019-20 | 6.39 | 4,685 |
2020-21 | 8.88 | 7,078 |
2021-22 | 4.60 | 5,249 |
2022-23 | 3.13 | 5,525 |
2023-24 | 2.61 | 4,008 |
2024-25 | 3.40 | 4,966 |
(28-02-25 వరకు) |
PM-AASHA Schem: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం-ఆశా పథకం పొడిగింపు
Published date : 15 Mar 2025 01:46PM