Skip to main content

Chai Wale Baba IAS Coaching : నోరు తెరవకుండానే.. ఐఏఎస్ కోచింగ్ ఇస్తాడు ఇలా విచిత్రంగా..!

దేశంలో నిర్వ‌హించే అత్యున్న‌త ప‌రీక్ష‌ల్లో ఒక‌టి యూపీఎస్సీ నిర్విహించే సివిల్స్ ప‌రీక్ష‌. అయితే యూపీఎస్సీ సివిల్స్‌ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించాలంటే... అనుకున్నంత ఈజీ కాదు.
Chai Wale Baba IAS Coaching

దీని కోసం క‌ఠోర దీక్ష‌తో చ‌ద‌వాలి. అలాగే కోచింగ్ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అలాగే సివిల్స్‌లో కోచింగ్ కూడా ఫీజు ఎక్కువ‌గా ఉంటుంది. వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు కోచింగ్‌ అంటే ఎంత డబ్బు వెచ్చించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

అందులోనూ ఐఏఎస్‌లాంటి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలకు కొచింగ్‌కి అయ్యే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో తెలియంది కాదు. కానీ అలాంటి కఠినతరమైన ఐఏఎస్‌ పోటీ పరీక్షకి ఫ్రీగా కోచింగ్‌ ఇస్తున్నాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి. ఇక్కడ విశేషం ఏంటంటే మౌనంగానే కోచింగ్‌ ఇస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడకుండా కోచింగ్‌ ఇస్తాడు. అందరికీ ఉన్నతోద్యోగాలు చేసే అవకాశం దక్కాలని ఇలా ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నాడట. ఇంతకీ ఎవరా ఆ వింత వ్యక్తి అని తెలుసుకోవాల‌ని ఉందా.. అయితే.. కింది స్టోరీని మీరు చ‌ద‌వాల్సిందే...

తన జీవితాన్ని ఐఏఎస్‌ కోచింగ్‌కే..
ఈ వ్యక్తి పేరు దినేశ్‌ స్వరూప్‌ బ్రహ్మచారి. ఎప్పుడూ కాషాయ దుస్తులు ధరించి, పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించే ఈయనను అంతా చాయ్‌వాలే బాబా గా పిలుస్తారు. తన జీవితాన్ని ఐఏఎస్‌(IAS) కోచింగ్‌కి అంకితం చేశారు. ఆయన అందరూ ఉన్నతోద్యోగాలు పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారికైనా ఉచితంగానే ఐఏఎస్‌ కోచింగ్‌ ఇస్తారు చాయ్‌వాలే బాబా .

నోరు తెరవకుండానే.. కోచింగ్ ఎలా..?

chai baba ias news telugu

కోచింగ్‌ ఇవ్వాలంటే నోరు విప్పాల్సిందే. స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా విపులంగా విడమర్చి గట్టిగా చెప్పక తప్పదు. అలాంటిది ఈయన నోరు తెరవకుండానే భోధిస్తారు. మౌనవ్రతం పాటిస్తూనే.. సైగలతో అభ్యర్థులను గైడ్‌ చేస్తుంటారు. వాట్సప్‌ ద్వారా నోట్స్‌ ఇస్తారు. ఇతరత్రా ఆదేశాలు, మెసేజ్‌లు కూడా వాట్సప్‌ ద్వారానే. అయినప్పటికీ.. వేలాది మంది ఆయన దగ్గర మెంటార్‌షిప్‌ తీసుకుంటున్నారు. ఏ డౌట్ ఉన్నా సరే, ఆయనకు వాట్సప్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆన్సర్ రిప్లై వస్తుంది.

ఇత‌ని ఆహారం కూడా విచిత్రంగా..
ఈ చాయ్‌వాలా బాబాకు సంబంధించిన మరొక విశేషమేమిటంటే.. ఆయన అస్సలు ఎలాంటి ఘనాహారం తినరు. కేవలం రోజుకి పది కప్పుల టీ(చాయ్‌) మాత్రమే తాగుతారు. అందువల్లే ఆయన్ని చాయ్‌వాలే బాబాగా పిలుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయన జీవనశైలి ఇదేనట.

విద్యార్థుల‌ డౌట్‌ వెంటనే ఇలా రిప్లై ఇస్తాడు...
ఆయన శిఘ్యులు తమ గురువు బాబా ఎప్పుడు ఏ సాయం కావాలన్నా.. తక్షణమే తమకు గైడెన్స్‌ ఇస్తారని అంటున్నారు. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన సైగలు, సంకేతాలు, వాట్సప్‌ మెసేజ్‌ల ద్వారానే గైడ్‌ చేస్తారని చెప్పారు. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్‌ చేస్తే చాలు, తక్షణమే రిప్లై ఇస్తారని చెబుతున్నారు. ఆఖరికి నోట్స్‌ కూడా వాట్సప్‌ ద్వారానే పంపుతారని ఓ శిఘ్యుడు చెబుతున్నాడు.

Published date : 15 Jan 2025 01:39PM

Photo Stories