Beti Bachao, Beti Padhao: ‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకానికి పదేళ్లు పూర్తి
Sakshi Education
దేశవ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంతోపాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమం ప్రారంభమై జనవరి 22వ తేదీకి పదేళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర ఈ పథకం ఒక పరివర్తనాత్మక, ప్రజల సాధికార పథకంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసిందన్నారు. గడిచిన పదేళ్లలో లింగ వివక్షలను అధిగమించడంలో కీలక పాత్ర పోషించిందని, బాలికలకు విద్య, వారి కలలను సాకారం చేసుకోవడానికి సరైన వాతావరణాన్ని సృష్టించిందని మోదీ అన్నారు.
ఈ కార్యక్రమం బాలికల హక్కులు, విద్య, గౌరవానికి కొత్త కోణాన్ని అందించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు.
➤ ఈ పథకాన్ని ప్రధాని మోడీ 2015 జనవరి 22వ తేదీ హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు.
➤ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు శిశు లింగ నిష్పత్తి (సిఎస్‌ఆర్) క్షీణతను అరికట్టడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం.
PM Modi: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రారంభించిన ప్రధాని
Published date : 24 Jan 2025 08:55AM