Raw Jute MSP: ముడి జనపనార మద్దతు ధర క్వింటానికి రూ.315 పెంపు

2025-26 మార్కెటింగ్ సీజన్‌లో ముడి జనపనార (జూట్) కనీస మద్దతు ధర క్వింటానికి రూ.315 పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 22వ తేదీ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీని ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీంతో 2025-26 సీజన్‌కు ముడి జూట్ (టీడీ-3 రకం) క్వింటం ధర క్వింటాలుకు రూ.5,650గా నిర్ణయించింది.
ఇది సాగు వ్యయం కంటే 66.8% అధికంగా ఉంటుంది. 2014-15తో పోలిస్తే ప్రస్తుతం ధర 2.35 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ నిర్ణయం రైతుల పట్ల ఉన్న అనుకూలతను పెంచుతుంది. వారు ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ లాభం పొందగలుగుతారు.
అలాగే.. జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మిషన్ ద్వారా అనేక మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో మంచి పురోగతి సాధించబడినట్లు మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 2030 నాటికి నిర్దేశించిన ఆరోగ్య లక్ష్యాలను సాధించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.