Skip to main content

No Entry : ఆల‌స్యం కావ‌డంతో నో ఎంట్రీ.. విద్యార్థులకు హెచ్చ‌రిక‌..!!

ఇంజినీరింగ్ కోర్సు కోసం IIT, NIT వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు పొందడానికి విద్యార్థులు ఎంతో కృషి చేస్తారు.
Officials denied student entry to jee exam due to delay

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంజినీరింగ్ కోర్సు కోసం IIT, NIT వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు పొందడానికి విద్యార్థులు ఎంతో కృషి చేస్తారు. దీని కోసం జేఈఈ ప‌రీక్ష‌లు నిన్న‌టి నుంచే ప్రారంభం అయ్యాయి. ప‌రీక్ష‌కు వారం లేదా నెల ముందు నుంచే అధికారులు, నిపుణులు విద్యార్థుల‌కు అన్ని విధాలుగా అవ‌గాహ‌న స‌ద‌స్సులు, జాగ్ర‌త్త‌లు, వివిధ స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తుంటారు. విద్యార్థులు వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా పాటించాల‌ని కూడా చెబుతుంటారు. చాలామంది ఈ అంశాల‌ను పాటిస్తే కొంద‌రు ఏమాత్రం ప‌ట్టించుకోరు.

JEE Mains 2025: జేఈఈ మెయిన్ 2025 జనవరి 23వ తేదీ ఉదయం షిఫ్ట్ విశ్లేషణ 

అనుమ‌తి లేదు..

విద్యార్థులు ఏమాత్రం పాటించ‌క‌పోయినా న‌ష్టం వారికే జ‌రుగుతుంది అన‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ అని చెప్పాలి.. విజయవాడ రూరల్ మండలం కానూరు వద్ద జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనంతపురం నుంచి ప‌రీక్ష కేంద్రానికి వచ్చిన ఓ విద్యార్థిని అధికారులు అనుమ‌తించ‌లేదు. కార‌ణం, ఆ విద్యార్థి సమయం ముగిశాక కేంద్రానికి చేర‌డ‌మే. దీంతో, ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆ విద్యార్థి ప‌రీక్ష‌కు హాజ‌రు కాలేక‌పోయారు. అధికారికంగా ప్రకటించిన సమయం తరువాత విద్యార్థి పరీక్షా కేంద్రానికి రావడంతోనే అనుమతించలేదని అధికారులు తెలిపారు.

JEE Advanced Exam Guidance: జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. సన్నద్ధత ఇలా!

ఇక‌పై ప్ర‌తీ విద్యార్థి తాను రాసే ఎటువంటి ప‌రీక్ష‌కైనా స‌మయానికి అర‌గంట ముందే చేరుకునే ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ ఒక్క‌రు ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకొని స‌మ‌య‌పాల‌న పాటిస్తూ ప‌రీక్ష‌కు హాజ‌రు కావాలని నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. ప‌రీక్ష‌ కేంద్రంలో ప్రతీ నియమాలను పాటించాల‌ని హెచ్చిరిస్తున్నారు అధికారులు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Jan 2025 08:53AM

Photo Stories