JEE Main 2025 Rules : ఈనెల 22 నుంచి జేఈఈ పరీక్షలు.. ఇవి పాటించడం తప్పనిసరి..

సాక్షి ఎడ్యుకేషన్: దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2025 పరీక్షను నిర్వహిస్తుంది. మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 22, 23, 24, 28, 29వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1(బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 30న మధ్యాహ్నం పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది.
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ ఊరిలో పరీక్ష కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్ వివరాలను సైట్‌లో ఉంచిన ఎన్‌టీఏ.. ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజుల ముందుగా అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేసింది. – గుంటూరు ఎడ్యుకేషన్
Tips for JEE Main 2025 : జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు టాప్ 5 టిప్స్.. ఇవి పాటిస్తే ర్యాంక్ మీదే..
2 గంటల ముందే చేరుకోవాలి: విద్యార్థులు అడ్మిట్ కార్డులో ఉన్న వివరాలను, నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. అందులో ప్రకటించే పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే చేరుకోవాలి.
పరీక్షల సమయం: జేఈఈ పరీక్షలు.. ఉదయం పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు జరగనుంది. ఉదయం పరీక్షకు 7.00 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులను పరీక్ష సమయానికి అరగంట ముందు అనుమతించరు. తర్వాత ప్రధాన గేట్లను మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది.
Courses and Jobs : ఆరు కోర్సులు.. పూర్తి చేసుకుంటే ఉద్యోగం.. ఇప్పటికే..
కఠిన నిబంధనలు: పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్ తరహాలోనే కఠిన నిబంధనలు అమలు చేస్తుంది ఎన్‌టీఏ. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను ధరించి రావాలని, కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని నిబంధనలు విధించింది.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు: ఎన్‌టీఏ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్‌కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాల్సి ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉండగా.. పక్కన మరో బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.
తప్పనిసరిగా తీస్కురావాలి: విద్యార్థి తమ వెంట అడ్మిట్‌కార్డుతో పాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు మరో పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్‌తో పాటు బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ కార్డును విధిగా తీసుకెళ్లాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- JEE Main 2025
- jee main exam rules 2025
- engineering entrance exam
- iit and nit admission tests 2025
- students education
- rules and regulations for jee main exam candidates
- admit card for jee main exam download
- time management for jee main exam students
- rules and regulations at jee main exam centers
- JEE Main exam schedule 2025
- jee main exam 2025 hall ticket download
- National Testing Agency
- Education News
- Sakshi Education News