Skip to main content

Students Survey : తెలుగులో వెన‌క‌బ‌డిన విద్యార్థులు.. ఈ స‌ర్వే ప్ర‌కారం..!

దేశ‌వ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లోని 17, 997 గ్రామాల్లో ఒక స‌ర్వే చేప‌ట్టారు అధికారులు.
ASER survey reveals student performance gaps in Telugu and mathematics   Least score of students in telugu and maths   ASER Survey conducted in 17,997 villages across 29 states to assess student skills

సాక్షి ఎడ్యుకేష‌న్: దేశ‌వ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లోని 17, 997 గ్రామాల్లో ఒక స‌ర్వే చేప‌ట్టారు అధికారులు. ఇందులో, ఎంత‌మంది విద్యార్థులు ఏఏ స‌బ్జెక్టుల్లో ముందున్నారు, ఏఏ స‌బ్జెక్టుల్లో వెన‌క‌బ‌డ్డారు అనే విష‌యం తేలిపోయింది. విద్యార్థులు తెలుగులో, లెక్క‌ల్లో ఎంత వెన‌క‌బ‌డిపోయి ఉన్నారో ఈ స‌ర్వే తేల్చి చెప్పింది. విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఆసర్) స‌ర్వేలో విస్తుపోయే విషయాలు తెలిసాయి.

అక్ష‌రాలు గుర్తించ‌లేక‌..

దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌తీ గ్రామాల్లోని పాఠ‌శాల‌ల్లో ఈ స‌ర్వేను చేప‌ట్టారు అధికారులు. దీంతో, విద్యార్థుల్లో ఎంత నైపుణ్యం ఏర్ప‌డిందో, వారికి ఏఏ స‌బ్జెక్టుల్లో ఎంత ప‌ట్టు ఉందో తెలిసిపోతుంది. తెలంగాణ‌ రాష్ట్రంలో 262 బడుల్లో ఈ సర్వే చేప‌ట్టగా, 1వ‌ తరగతిలో 30% విద్యార్థుల‌కి తెలుగులో కనీసం ఒక‌ అక్షరం కూడా చదివ‌డం రావట్లేదు.

ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయిని .. ఇదీ పరిస్థితి!

ఇక 2వ తరగతి విష‌యానికొస్తే, వారి పుస్తకాలను 56% పైగా విద్యార్థులు చదవడంమే లేదు. 3వ‌ తరగతిలో 7.8% వీరికి క‌నీసం అక్షరాలు కూడా ప‌ల‌క‌డం లేదు. 26.5 % మంది విద్యార్థులు అక్షరాలు చదువుతున్నాప్ప‌టికీ.. తెలుగులోని పదాలను పూర్తిగా చదవలేకపోతున్నారు. ఇక లెక్కల విష‌యం అయితే, లెక్క‌లు చేయ‌డం లేదు, గుర్తుపెట్టుకోవ‌డం అస‌లే లేదు.

నైపుణ్యాలు పెరిగేదెలా..!

ఇదిలా ఉంటే, మ‌రి వీరిని దాటుకొని పై త‌ర‌గతుల‌కు వెళ్లిన‌వారి పరిస్థితి ఏంటి..?? ఇక్క‌డ అయితే, 8వ తరగతిలో 7% పైగా విద్యార్థులు అక్షరాలను అస‌లు గుర్తించ‌లేక‌పోతున్నారు. ఈ తరగతిలో 1.6 శాతం విద్యార్థుల ప‌రిస్థితి ఇదే. ఈ విద్యార్థుల్లో 22% మంది 1వ త‌ర‌గ‌తి పుస్తకాలు కూడా చ‌ద‌వ‌లేని ప‌రిస్థితి.

JEE Main Exam: జేఈఈ మెయిన్‌ ప్రశ్నల్లో.. కొన్ని అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత!

విద్యార్థులకు ఏమాత్రం స‌బ్జెక్టుపై అవగాహ‌న లేదు, క‌నీసం చ‌దివేందుకు అక్ష‌రాల‌ను ప‌ల‌క‌డం గ‌గ‌నంగా ఉంది. ఉపాధ్యాయులు విద్యార్థుల‌కు ఏం నేర్పిస్తున్నారు అని వారి త‌ల్లిదండ్రులు, గ్రామ‌స్తులు, అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది ఇలాగే, కొన‌సాగితే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగే అవ‌కాశం త‌గ్గిపోతుంది. వారిలో విద్య‌, నైపుణ్యాలు రెండూ అత్యంత కీల‌క‌మే.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Jan 2025 03:07PM

Photo Stories