Skip to main content

How to Avoid Social Media During Study time: పరీక్షల సమయం.. ఫోన్‌, సోషల్‌మీడియాకు ఇలా దూరంగా ఉండండి

పరీక్షల సమయం దగ్గరపడుతుంది.. రానున్న రోజుల్లో టెన్త్‌, ఇంటర్‌, ఇంజనీరింగ్‌, జేఈఈ సహా కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ ఉన్నాయి. ఇలాంటి కీలకమైన సమయంలో విద్యార్థులు పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాలి. అయితే చాలామంది స్టూడెంట్స్‌ మొబైల్‌, టీవీ, సోషల్‌ మీడియా అంటూ గంటలకొద్దీ స్క్రీన్‌టైంలోనే గడిపేస్తూ సమయం వృధా చేసుకుంటున్నారు. దీని ప్రభావం పరీక్షా ఫలితాలపై పడటమే కాకుండా, మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. మరి దీన్నుంచి ఎలా బయటపడాలి? మంచి మార్కులు సాధించడానికి, ఫోకస్ పెంచడానికి అవసరమైన ఉపయోగకరమైన టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.
How to Avoid Social Media During Study time
How to Avoid Social Media During Study time

ఫోన్, టీవీ దూరంగా ఉంచడం ఎందుకు అవసరం?

  • దృష్టి మళ్లించకుండా చదవటానికి – ఫోన్‌లో నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్డేట్‌లు మన ధ్యాసను కదిలిస్తాయి.
  • సమయం వృధా కాకుండా ఉండటానికి – "ఒకసారి చెక్ చేయాలి" అనుకుంటే గంటలు గడిచిపోతాయి.
  • ఓటమి భయాన్ని తగ్గించుకోవడానికి – ఎక్కువ స్క్రీన్ టైమ్ ఒత్తిడిని పెంచి, మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.
  • ఆరోగ్య సమస్యలు నివారించడానికి – ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల కళ్ళకు ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

మంచి మార్కులు సాధించడానికి ఉపయోగకరమైన టిప్స్

  1.  ఏ ఆటంకం లేని మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
  2. ఫోన్, టీవీని పూర్తిగా దూరం పెట్టాలి.
  3. Pomodoro Technique (25 నిమిషాలు చదవడం, 5 నిమిషాల బ్రేక్) పాటించాలి.
  4. హెల్తీ డైట్, మంచి నిద్ర పాటించడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
  5. దినచర్యను సెట్ చేసుకుని ప్రతి రోజు ఒకే సమయానికి చదవాలి.
  6.  ఫోన్‌ను Silent Mode లో పెట్టి, చదువుకోడానికి ఉపయోగపడే Apps మాత్రమే ఉపయోగించాలి.

తల్లిదండ్రులు ఏమి చేయాలి?

  • పిల్లలను మోటివేట్ చేయాలి, కానీ ఒత్తిడి తెచ్చి భయపెట్టొద్దు.
  •  చదువుకు అవసరమైన శాంతమైన వాతావరణాన్ని కల్పించాలి.
  • ఫోన్, టీవీ చూసే సమయాన్ని సరిచేసేందుకు నిబంధనలు పెట్టాలి.
  • మంచి ఫలితాలు వస్తే ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.

ఇవి గుర్తుంచుకోండి..

  • ఫోన్, టీవీ సమయం తగ్గించుకోండి
  • ప్రతి రోజూ ఒకే సమయానికి చదవండి
  • పూర్తి నిద్ర తీసుకోండి
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
  • టెన్షన్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి పాటించండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 17 Feb 2025 11:25AM

Photo Stories