AP & TS Schools Summer Holidays 2023 : ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..?
ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీలో 1వ తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. అనంతరం మరో రెండు రోజుల పాటు ఫలితాల వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. తర్వాత ఏప్రిల్ 30 నుంచి స్కూల్స్‌కు సెలవులు ఉంటాయని ఏపీ విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం అవ్వనున్నట్లు సమాచారం.
అయితే ఉష్టోగ్రతలు ఒకవేళ ఎక్కువగా ఉంటే.. ఈ సెలవులు షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది. అంటే దాదాపు 45 రోజులు పాటు ఏపీ పాఠశాలకు సెలవులు రానున్నాయి. ఒక వేళ ఎండ తీవ్రత ఎక్కవగా ఉంటే.. ఈ వేసవి సెలవులను పొడిగించే అవకాశం ఉంది. అలాగే ఏపీలో వేసవి తీవ్రత ఎక్కవ అవుతున్న నేపథ్యంలో.. మార్చి రెండో వారం నుంచే.. ఒంటి పూట బడి నిర్వహించే అవకాశం ఉండనున్నది.
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!
ఏపీ పదో తరగతి విద్యార్థులకు మాత్రం..
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 19వ తేదీన నుంచి వారికి సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఆరు సబ్జెక్టులకు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. పరీక్షల టైమ్ టేబుల్ ఫైనల్ చేసిన నేపథ్యంలో.. పబ్లిక్ హాలీడేలు, సాధారణ సెలవులు ప్రకటించినా ఆ రోజుల్లో పరీక్షలు యథాతథంగా జరుగనున్నాయి. స్టూడెంట్స్‌కు కేటాయించిన కేంద్రాల్లో మాత్రమే పరీక్షలను రాయాల్సి ఉంటుందని, ఎగ్జామ్ సెంటర్స్ మార్పును ఎట్టి పరిస్థితుల్లో అమోదించరని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గతంలో స్పష్టం చేసిన విషయం తెల్సిందే.
☛➤ తెలంగాణ పదో మోడల్ పేపర్స్ Ebook ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి
☛➤ ఏపీ, తెలంగాణ పదో స్టడీమెటీరియల్ PDF ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో స్కూల్స్‌కు ఒంటి పూట బడులు, వేసవి సెలవులు ఇలా..?
తెలంగాణ పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రం చలి తగ్గుముఖం పట్టింది. పగలు ఎండ దంచి కొడుతుంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. స్కూల్స్‌లోని విద్యార్థులు వేడికి మరింత ఇబ్బంది పడుతున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో..
ఒంటి పూట బడులకు సంబంధించి కూడా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా క్లారిటీ ఇచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి స్కూల్స్ సగం పూటే నడుస్తాయని తెలిపింది. అంటే విద్యాశాఖ అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం ప్రకారం మార్చి 15వ తేదీ (బుధవారం) నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభం అవ్వనున్నాయి. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
కొన్ని అనివార్య కారణాల వల్ల..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 12 నుంచి పరీక్షలను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం 1వ తరగతి నుంచి 5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉన్నందున వారికి ఎగ్జామ్స్ ఏప్రిల్ 17వ తేదీతో పూర్తి అవుతాయి. 6వ తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షలు ఉంటాయి.
టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
మొత్తం వేసవి సెలవులు ఇలా..?
ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 21వ తేదీన విద్యార్థులకు వెల్లడించి.. రికార్డుల్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వేసవి సెలవుల విషయానికి వస్తే.. తెలంగాణలో మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఒక వేళ ఎండ తీవ్రత ఎక్కవగా ఉంటే.. ఈ వేసవి సెలవులను పొడిగించే అవకాశం ఉంది. 1వ తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలుంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
చదవండి: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం
చదవండి: Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..