Schools and Colleges Holiday 2023 : మార్చి నెలలో స్కూళ్లు, కాలేజీలకు 8 రోజులు సెలవులు.. ఎలా అంటే..?
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్చి 7వ తేదీన సాయంత్రం కామదహనం తర్వాత మార్చి 8న తేదీన హోలీని జరుపుకుంటారు. మార్చి 08 ఒక్కరోజు మాత్రమే.. ప్రభుత్వం పాఠశాలకు, కాలేజీలకు సెలవు దినంగా ప్రకటించారు.
➤ AP & TS Schools Summer Holidays 2023 : ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..?
మార్చి 13వ తేదీన పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు..
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 13వ తేదీన షాపులు, పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు సెలవును ప్రకటించారు. ఎందుకంటే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 13వ తేదీ సెలవు దినంగా ప్రకటిస్తూన్నట్టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 22వ తేదీన ఉగాది పండగ ఉన్న విషయం తెల్సిందే. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వనున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 30వ తేదీన శ్రీరామనవమి పండగ ఉంది. ఈ సందర్భంగా మార్చి 30వ తేదీన కూడా కాలేజీలకు, స్కూల్స్‌కు కూడా సెలవులను ఇవ్వనున్నారు.
TS Special Holiday : గుడ్‌న్యూస్.. ఆ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు.. కారణం ఇదే..
అలాగే మార్చి 15వ తేదీ నుంచే..
ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోని ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మార్చి 15 నుంచే ఒంటిపూట బడులను నిర్వహించే అవకాశం ఉంది.
➤ TS Half Day Schools 2023 : ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈ సారి భారీగానే వేసవి సెలవులు..
➤ AP Half Day Schools 2023 : ఏపీ ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈసారి వేసవి సెలవులు భారీగానే ..!
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 8వ తేదీ సెలవు..
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం.. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం నాడు సెలవు వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించారు.