Skip to main content

TS Special Holiday : గుడ్‌న్యూస్‌.. ఆ రోజున‌ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల‌కు సెలవు.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రం ప్ర‌భుత్వం.. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా.. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం నాడు సెలవు వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్  ప్ర‌క‌టించారు.

AP Schools and Colleges Holidays : మార్చి 13న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు.. అలాగే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సంస్థలకు కూడా..

ఈ రోజున ఘనంగా..

womens day 2023 india telugu news

మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏ మేరకు ఎదుగుతున్నారో గుర్తించే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ రోజున ఘనంగా జరుపుకుంటాయి. అలాగే మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన మహిళలను సన్మానించే అవకాశముంది. ప్రతి ఏడాది కూడా ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను ప్రభుత్వం సన్మానిస్తోంది. ఈ సారి కూడా ఆ కార్యక్రమం జ‌ర‌గ‌నున్న‌ది.

➤ AP & TS Schools Summer Holidays 2023 : ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఎన్ని రోజులంటే..?

Published date : 06 Mar 2023 07:23PM

Photo Stories