AP Schools and Colleges Holidays : మార్చి 13న పాఠశాలలు, కాలేజీలకు సెలవు.. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కూడా..
ఈ మేరకు సెలవును ప్రకటిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 13వ తేదీ సెలవు దినంగా ప్రకటిస్తూన్నట్టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, పాఠశాలలు, గవర్నమెంట్, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13 న సెలువు దినంగా ప్రకటించడంతో అందరూ అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.
మార్చి 16వ తేదీన..
ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెల్సిందే. అయితే.. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 స్థానాలు అధికార వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో మరో 4 స్థానిక సంస్థల నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మూడు పట్టభద్రులు, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మార్చి 16వ తేదీన కౌంటింగ్ చేపట్టి.. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.
➤ AP & TS Schools Summer Holidays 2023 : ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..?
ఏపీలో ఎన్నికలు జరిగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఇవే..
☛ ప్రకాశం నెల్లూరు చిత్తూరు
☛ కడప అనంతపురం కర్నూల్
ఏపీలో 8 స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే జిల్లాలు ఇవే..
☛ పశ్చిమ గోదావరి
☛ తూర్పుగోదావరి
☛ నెల్లూరు
☛ కడప
☛ అనంతపురం
☛ శ్రీకాకుళం
☛ చిత్తూరు
☛ కర్నూల్
➤ TS Half Day Schools 2023 : ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈ సారి భారీగానే వేసవి సెలవులు..