Skip to main content

NPCIL Executive Trainee Jobs: NPCILలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు జీతం నెలకు 74వేలు

NPCIL jobs  NPCIL Executive Trainee 2025 recruitment notification   NPCIL job vacancies for Executive Trainee 2025 NPCIL Executive Trainee 2025 online application details
NPCIL jobs

భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) , మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ సంస్థ నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

AAIలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు జీతం నెలకు 40వేలు: Click Here

మొత్తం ఉద్యోగాల సంఖ్య : మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 
మెకానికల్ – 150
కెమికల్ – 60
ఎలక్ట్రికల్ – 80
ఎలక్ట్రానిక్స్ – 45
ఇన్స్ట్రుమెంటేషన్ – 20
సివిల్ – 45

విద్యార్హత :
AICTE / UGC ద్వారా  గుర్తింపు పొందిన యూనివర్సిటీ / డీమ్డ్ యూనివర్సిటీ/ సంస్థ నుండి నోటిఫికేషన్ లో ప్రస్తావించిన విభాగంలో 60 శాతం మార్కుల తో బి.టెక్ / బి.ఈ/ బి.ఎస్సీ (ఇంజనీరింగ్) / 5 సంవత్సరాల  ఇంటిగ్రేటెడ్ M.Tech ఉత్తీర్ణత సాధించాలి.
సంబంధిత విభాగంలో గేట్ – 2023 లేదా గేట్ – 2024 లేదా గేట్ – 2025 స్కోర్ కలిగి వుండాలి.

వయస్సు : 26 సంవత్సరాల లోపు వయస్సు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం : అభ్యర్థులను ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు :
జనరల్ , ఓబీసీ, EWS, కేటగిరీ లకు చెందిన పురుష అభ్యర్థులు 500/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
మహిళా అభ్యర్థులు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు,  ఎక్స్ సర్వీస్ మాన్ , దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న వారిని గేట్  స్కోర్ ఆధారంగా 1:12 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూ కొరకు పిలుస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వచించి , అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
 ఇంటర్వ్యూ లో జనరల్ అభ్యర్థులు 70 శాతం మార్కులు & మిగతా అందరూ 60 శాతం మార్కులు కనీస క్వాలిఫైడ్ స్కోర్ గా నిర్ణయించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా తయారుచేసిన మెరిట్ లిస్టు 20 సెప్టెంబర్ 2025 వరకు వాలిడ్ గా వుంటుంది.

ఇంటర్వ్యూ షెడ్యూల్ & ఇంటర్వ్యూ కేంద్రం :
జూన్ 9 నుండి 21 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ముంబై లోని అణుశక్తి నగర్, ఉత్తర ప్రదేశ్ లోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్, తమిళనాడు లోని  మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కర్ణాటక లోని కాగా జనరేషన్ పవర్ స్టేషన్.
అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసేటప్పుడే ఇంటర్వ్యూ కేంద్రం యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వాలి.

స్టైఫండ్ :
ట్రైనింగ్ సమయంలో 74,000/- రూపాయల నెలవారి లభిస్తుంది. మరియు 30,000/- రూపాయల వన్ టైమ్ బుక్ అలవెన్స్ లభిస్తుంది.
ట్రైనింగ్ పూర్తి అయ్యాక ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నుండి సైంటిఫిక్ ఆఫీసర్ గా లెవెల్ – 10 పే స్కేల్ తో 56,100/- రూపాయల బేసిక్ పే తో పాటు 53 శాతం డియర్నెస్ అలవెన్స్ తో పాటు వివిధ అలవెన్స్ లు లభిస్తాయి.

ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 10/04/2025 (10:00 గంటల నుండి)
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 30/04/2025 (సాయంత్రం 04:00 గంటల లోగా)

Click here for Notification

Click here to apply

Published date : 23 Apr 2025 08:30AM

Photo Stories