Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఆంక్షలు.. SEVP అర్హత రద్దు హెచ్చరిక!

అంతేకాదు, 2024–25 విద్యా సంవత్సరంలో హార్వర్డ్‌లో చేరిన 6,793 మంది విదేశీ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల సంబంధిత వివరాలను ఈనెల 30లోపు సమర్పించాలంటూ** అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ** స్పష్టంగా హెచ్చరించింది.
SEVP అర్హత రద్దు హెచ్చరిక:
“వివరాలు సమర్పించకపోతే, హార్వర్డ్ యూనివర్శిటీకి ఉన్న స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) అర్హతను రద్దు చేస్తాం” అని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ పేర్కొన్నారు.
చదవండి: Foreign Education Scholarships: విదేశీ విద్యకు.. స్కాలర్‌షిప్స్ ఇవే!
పన్ను మినహాయింపు హోదాను కూడా రద్దు చేయాలన్న యోచన:
హార్వర్డ్ వర్సిటీకి ఉన్న $53.2 బిలియన్ ఫండింగ్ నిధులపై ప్రభావం పడేలా, పన్ను మినహాయింపు హోదాను రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి **Internal Revenue Service (IRS)**కి సమాచారం కోరగా, వర్సిటీపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం:
ఈ ఆంక్షలు కొనసాగితే, విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియ, ప్రవేశాలు, పన్ను మినహాయింపులు వంటి అంశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. హార్వర్డ్ యూనివర్సిటీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
![]() ![]() |
![]() ![]() |
Tags
- Trump sanctions Harvard
- Harvard foreign students
- SEVP visa program
- Trump vs Harvard University
- US student visa policy 2025
- Trump restrictions on universities
- Harvard international students 2025
- Student and Exchange Visitor Programx
- Student and Exchange Visitor Program
- Trump education policy changes
- Harvard tax exemption controversy
- USPolitics
- EducationNews