Skip to main content

Tenth Class Marks: ఆ అభ్యర్థికి టెన్త్ లో 600కు 600 మార్కులు

పదో తరగతిలో 600కు 600 మార్కులు సాధించడం సాధ్యమయ్యే పనేనా?! కానీ ఓ అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి.
tenth class marks
ఆ అభ్యర్థికి టెన్త్ లో 600కు 600 మార్కులు

దీంతో ఆ అభ్యర్థి ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్‌ ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అటెండర్‌ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్దేశించి.. దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే 2018లో పదో తరగతి పూర్తి చేసిన ఓ అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో 600, 582, 574 మార్కులు సాధించిన ముగ్గురిని అటెండర్లుగా ఎంపిక చేశారు. వారు ఫిబ్రవరి 16న ఉద్యోగాల్లో చేరారు. మెరిట్‌ జాబితాను పరిశీలించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో విషయం జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి చేరింది. దీంతో పదో తరగతి విద్యార్హత పత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు వాటిని ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపాలని నిర్ణయించారు. 

చదవండి: 

Tenth Class: అర్థమైనా కాకున్నా పాఠాలు.. సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యం

ఉన్నతవిద్య బలోపేతంపై దృష్టి

రాష్ట్రంలోని స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం

Tenth Class: రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే పరీక్షలు.. పరీక్షల షెడ్యూల్‌ ఇలా...

Published date : 17 Feb 2022 01:48PM

Photo Stories