Tenth Class: రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే పరీక్షలు.. పరీక్షల షెడ్యూల్ ఇలా...
ఈ వివరాలను తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్, పరీక్షల విభాగం ఫిబ్రవరి 12న విడుదల చేసింది. ఉదయం 9.30 నుంచి 12.45గం. వరకు పరీక్ష ఉంటుందని తెలిపింది. ఆబ్జెక్టు పేపర్‌ను ఎప్పటిలాగే పరీక్షకు అరగంట ముందు విద్యార్థులకు అందజేస్తారంది. కరోనాతో రెండేళ్లుగా ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను నిర్వహించలేదు. 2020లో తెలుగు, హిందీ పరీక్షలు జరిపిన తర్వాత మిగతా పరీక్షలను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరీక్షలు నిర్వహించే వీల్లేకపోవడంతో రద్దు చేశారు. ఆ తర్వాత 2021లో టెన్త్ పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు. కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి.
టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇలా...
తేదీ |
పరీక్ష |
11.5.22 |
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–ఎ) |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు) |
|
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సు) |
|
12.5.22 |
సెకండ్ లాంగ్వేజ్ |
13.5.22 |
థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) |
14.5.22 |
గణితం |
16.5.22 |
జనరల్ సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్) |
17.5.22 |
సోషల్ స్టడీస్ |
18.5.22 |
ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 (సంస్కృతం, అరబిక్) |
19.5.22 |
ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం, అరబిక్) |
20.5.22 |
ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) |
చదవండి:
ఈ శాఖలో ఉద్యోగాలకు నకిలీ సర్టిఫికెట్లు.. వారిపై క్రిమినల్ కేసులు