ఈ శాఖలో ఉద్యోగాలకు నకిలీ సర్టిఫికెట్లు.. వారిపై క్రిమినల్ కేసులు
Sakshi Education
వైద్య, ఆరోగ్య శాఖ నియామకాల్లో కొందరు అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో ప్రత్యేక రాయితీలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైద్య శాఖలో ఉద్యోగాలకు నకిలీ సర్టిఫికెట్లు
కరోనా సమయంలో కాంట్రాక్టు పద్ధతిలో సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి శాశ్వత, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నియామకాల్లో వెయిటేజ్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వైద్య శాఖలో చేపడుతున్న నియామకాల్లో వెయిటేజ్ మార్కులు పొందేందుకు పలువురు అభ్యర్థులు కరోనా సమయంలో పనిచేసినట్టు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారు. ప్రజారోగ్య విభాగంలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామకాల్లో ఈ వ్యవహారం బయటపడింది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఫిబ్రవరి 11న హెచ్చరించారు.