ఇన్ సర్వీస్ అభ్యర్థుల దరఖాస్తుకు అవకాశం
Sakshi Education
వైద్య విద్య 2021–22 విద్యా సంవత్సరానికిగానూ పీజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లలో ప్రవేశాలకు ఇన్ సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 4న సవరించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఫిబ్రవరి 5ప మధ్యాహ్నం 1 గంట నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. నీట్–2021లో అర్హత సాధించడంతో పాటు, ఇతర అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని 50 శాతం సీట్లలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ –క్లినికల్ ఇన్ సర్వీస్ అభ్యర్థులకు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
చదవండి:
తప్పనిసరి బదిలీ లిస్టులో 1,300 మంది ఉద్యోగులు
Published date : 05 Feb 2022 01:51PM