Spot Admissions: పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ
Sakshi Education
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Spot Admissions
ఏపీపీజీసెట్– 2024లో ఉత్తీర్ణులు కాకపోయినా, పరీక్ష రాయకపోయినా కేవలం డిగ్రీ ఉత్తీర్ణత ద్వారా ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ బాటనీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ జువాలజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలియజేశారు.
స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులు మొత్తం కోర్సు ఫీజు, అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉటుందని, వీరికి ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ రాదని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో ఆయా డిపార్ట్‌మెంట్ల లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.