తప్పనిసరి బదిలీ లిస్టులో 1,300 మంది ఉద్యోగులు
విభాగాల వారీగా అందరు ఉద్యోగుల సర్వీసు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా బదిలీ ప్రక్రియ చేపడుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 13 జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో ట్యూటర్‌ల నుంచి ప్రొఫెసర్ స్థాయి వరకూ బదిలీలకు అర్హులైన వారి గుర్తింపు పూర్తయింది. 431 మంది ప్రొఫెసర్‌లు ఉండగా వీరిలో 250 మందికిపైగా ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. అదే విధంగా 375 మంది అసోసియేట్ ప్రొఫెసర్లలో 190 మందికిపైగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1,737 మందికి గాను 800 మంది, ట్యూటర్లు 123 మందికి గాను సుమారు 70 మంది.. ఇలా మొత్తంగా 1,300 మందికిపైగా తప్పనిసరి బదిలీల జాబితాలో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. వీరందరి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. ఉద్యోగులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి:
12 Thousand Jobs: పోస్టులు భర్తీకి చర్యలు
39000 Jobs: వైద్య ఆరోగ్య శాఖలో 39 వేల ఉద్యోగాలు
Medical Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్.. నీట్ కటాఫ్ స్కోరు తెలుసుకోండి..