Medical Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్.. నీట్ కటాఫ్ స్కోరు తెలుసుకోండి..
నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2021 నీట్‌లో 720 మార్కులకు గాను నిర్ణీత కటాఫ్ మార్కులు (కనీస అర్హత మార్కులు) సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జ్టి్టpట://uజ.n్టటuజిట్చఛీఝజీటటజీౌnట.ఛిౌఝ వెబ్‌సైట్ ద్వారాజనవరి 29న ఉదయం 11 గంటల నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అభ్యర్థుల మెరిట్ జాబితా ప్రకటించి కౌన్సెలింగ్ చేపడతారు. అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌కు ఈ అప్లికేషన్లనే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. కౌన్సెలింగ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్, ఆయుర్వేద, హోమియోపతి, యునాని కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేస్తారు.
అభ్యర్థుల నీట్ కటాఫ్ స్కోరు ఇదీ..
- జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు – 138 మార్కులు
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులు, ఈ కేటగిరీల్లోని వికలాంగ అభ్యర్థులు - 108 మార్కులు
- ఓసీ/ఈడబ్ల్యూఎస్ వికలాంగ అభ్యర్థులు - 122 మార్కులు
రాష్ట్రంలో మెడికల్ సీట్లు..
ఏపీలో మొత్తం 30 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 1,986, ప్రైవేటు కాలేజీల్లోని కేటగిరీ–ఏలో 1,325, కేటగిరీ–బీలో 921, కేటగిరీ–సీలో 427 సీట్లు ఉన్నాయి. అఖిల భారత కోటా కింద 351 సీట్లు ఉన్నాయి. 16 డెంటల్ కాలేజీల్లో 1,440 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కోటా సీట్లు 119, ఏ కేటగిరీలో 650, బీ కేటగిరీలో 454, సీ కేటగిరిలో 196, అఖిల భారత కోటాలో 21 సీట్లు ఉన్నాయి.
చదవండి:
Good News: వైద్య శాఖలో బదిలీలకు అనుమతి