Shyam Prasad Pigilam: షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ
Sakshi Education
వైద్య విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలను నిర్వహిస్తామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ పిగిలం శ్యామ్‌ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ
అన్ని పరీక్షలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుతున్నట్లు వివరించారు. పరీక్షలు వాయిదా వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆయన ‘సాక్షి’తో జనవరి 27న మాట్లాడుతూ.. ఒకవేళ పాజిటివ్ వచ్చిన విద్యార్థులు ఉంటే, వారికి వేరుగా గదిని కేటాయించి పరీక్షలు జరుపుతామన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు మార్చి నాటికి అన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఏప్రిల్‌లో నీట్ నిర్వహించేందుకు వీలుగా ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.