Skip to main content

Jobs In Medical College: వైద్య కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Jobs In Medical College  Hyderabad State Government Medical College Job Vacancies Announcement  Medical and Health Services Recruitment Board Approval 607 Vacancies in Government Medical Colleges  Key Cadre Vacancies Filling Directive  State Medical and Health Department Initiatives

సాక్షి,  హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు కీలక కేడర్‌లలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ మేరకు 36(8 కొత్త మెడికల్‌ కాలేజీలతో కలిపి) ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చిది. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్‌.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే

మొత్తం 34 డిపార్ట్‌మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీలో కలిపి 85 పోస్టులకుపైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పరిమిత సంఖ్యలో పోస్టులున్నాయి. అకాడమిక్‌ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్‌ సర్వీస్‌ వెయిటేజీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

435 ఎంబీబీఎస్‌ డాక్టర్‌ పోస్టులకు 2,400 దరఖాస్తులు
ప్రభుత్వ దవాఖాన్లలోని 435 ఎంబీబీఎస్‌ (సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌) డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగియనుంది. బుధవారం నాటికి సుమారు 2400 మంది డాక్టర్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

Artificial Intelligence Impact: రానున్న రోజుల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. తాజా నివేదికలో షాకింగ్‌ విషయాలు

ఇంకో వెయ్యి దరఖాస్తులు వరకూ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఒక్కో పోస్టుకు ఐదుగురు డాక్టర్లు దరఖాస్తు చేయగా, ఈసారి ఒక్కో పోస్టుకు 7 నుంచి 8 అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ప్రాక్టీస్‌పై బ్యాన్‌ పెట్టినప్పటికీ, ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం. 

Published date : 11 Jul 2024 11:29AM

Photo Stories