Jobs: వెద్యారోగ్యశాఖలో హెచ్‌వోడీ పోస్టులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్య సంచాలకులు, డ్రగ్స్ కంట్రోలర్, టీవీవీపీ కమిషనర్ పోస్టులు ఏపీకి వెళ్లిన నేపథ్యంలో... ఇప్పటివరకూ తెలంగాణ కేవలం ఇన్‌చార్జ్ పోస్టులతోనే నెట్టుకొచ్చింది.
ఇప్పుడు తాజాగా వైద్యారోగ్యశాఖలో మరో మూడు శాఖల అధిపతుల (హెచ్‌వోడీ) పోస్టులు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పదేళ్లుగా ఈ పోస్టులను తీసుకొచ్చేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించలేదనే విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య విద్యాసంచాలకుల పోస్టును సృష్టించిన సంగతి తెలిసిందే.
చదవండి: MBA Pharma Course : ఫార్మా ఎంబీఏతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొలువులు ఇలా..!
ఆగస్టు 2న జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ వైద్యారోగ్యశాఖలో మరో మూడు హెచ్‌వోడీ పోస్టుల అంశంపై చర్చించారు. త్వరలోనే ఆ పోస్టులు ఏర్పాటు కానున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.
Published date : 02 Aug 2024 01:02PM
Tags
- HOD Posts
- Department of Medicine
- Director of Medical Education
- Jobs
- Telangana News
- Congress Govt
- Congress Government Health Posts
- New HOD Positions Health Department
- Medical Education Director Creation
- BRS Government Criticism
- Health Department Reforms
- Administrative Changes Congress
- Government Health Sector Updates
- HOD Posts Addition
- Health Department New Positions
- SakshiEducationUpdates