Admissions: యూజీసీ మార్గదర్శకాల మేరకు అడ్మిషన్లు
అడ్మిషన్లకు సంబంధించిన కేసులో ఇరు పార్టీలు దీనికి అంగీకరించడంతో పిటిషన్పై విచారణను ముగించింది. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను జూలైలోపు పూర్తి చేయడం లేదని, దీంతో తరగతుల ప్రారంభం తీవ్ర ఆలస్యం అవుతోందని హైదరాబాదుకు చెందిన న్యాయవాది భాస్కర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
తొలుత ఈ పిటిషన్పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బీసీఐ నుంచి గుర్తింపు పొందని కాలేజీల జాబితాలో నల్సార్ కూడా ఉందన్న ప్రస్తావన రావడంతో ఆ వర్సిటీకి చాన్స్‌లర్‌గా ఉన్న తాను విచారణ జరపడం సమంజసం కాదని సీజే అభిప్రాయపడ్డారు.
చదవండి: Degree Courses: డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టం.. పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు.. ఇలా
ఈ నేప థ్యంలో ఈ పిల్పై విచారణను జస్టిస్ సుజోయ్పీల్, జస్టిస్ నామవరపు రాజే శ్వర్రావు ధర్మాసనానికి బదిలీ చేశారు. పార్టీ ఇన్ పర్సన్ పిటిషనర్, ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. ఈ ఏడాదికి న్యాయ విద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముగియడంతో వచ్చే సంవత్సరం నుంచి యూజీసీ, బీసీఐ మార్గదర్శకాలు పాటించాలని సర్కార్ ను ధర్మాసనం
ఆదేశించింది. దీనికి ఇరు పార్టీలు అంగీకరించాయి.