Breaking News: పరీక్షలు రద్దు.. కీలక ఆదేశాలు
ఈ మేరకు బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ విద్యార్థులకు వాట్స్‌అప్ ద్వారా పేపర్లను పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బోర్డు సెక్రెటరీ ప్రశ్నాపత్రాల లీక్ విషయమై ఆ ఇన్‌స్టిట్యూట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ పైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరీక్షలు రద్దు.. తిరిగి ఈ పరీక్షలు ఈ తేదీనే..:
ఫిబ్రవరి 8,9వ తేదీన జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలను తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసింది. ఆయా పరీక్షలను తిరిగి ఫిబ్రవరి 15, 16వ తేదీన నిర్వహించనున్నది. అలాగే ఈ విద్యార్థులను వేరే కాలేజీలకు బదిలీ చేయనుంది. క్వశ్చన్ పేపర్ లీకేజీపై ఇప్పటికే స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ షోకాజ్ నోటీసులు పంపింది. అలాగే గుర్తింపు కూడా రద్దు చేసే అవకాశం ఉంది.
Exam Paper Leak: పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్.. వాట్స్‌అప్ ద్వారా