Campus Merit List : ఆర్‌జీయూకేటీ క్యాంపస్ మెరిట్ లిస్ట్ విడుదల.. పది సీట్లు అదనంగా
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎస్‌ఎంపురం క్యాంపస్ మెరిట్ లిస్ట్‌ను గురువారం అధికారులు విడుదల చేశారు. 10వ తరగతి మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెయిటేజ్, ప్రత్యేక రిజర్వేషన్, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా రాష్ట్రంలో విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో శ్రీకాకుళం, నూజివీడు, ఇడుపుల పాయ, ఒంగోలు క్యాంపస్‌లను ఎంపిక చేసుకున్నారు. శ్రీకాకుళం క్యాంపస్‌కు సంబంధించి మహిళలకు 685, పురుషులకు 325, ప్రత్యేక కేటగిరీల్లో 100 మందికి ప్రవేశాలు కల్పించారు. మొత్తం 1100 సీట్లకు 1110 సీట్లు కేటాయించారు.
10 సీట్లు అదనంగా కేటాయించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 915, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు 95, తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 12, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒకటి, ఇతర ప్రత్యేక కేటగిరీలకు మిగిలిన సీట్లు కేటాయించారు. శ్రీకాకుళం క్యాంపస్‌కు ఎంపికైన విద్యార్థులకు ఎస్‌ఎంపురం క్యాంపస్‌లో ఈ నెల 26, 27 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది.
KRR Degree College: కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి
కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ, పరిపాలన అధికారి మునిరామకృష్ణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నూజివీడుకు 160 మంది, ఇడుపులపాయకు ఒకరు, ఒంగోలుకు 112, శ్రీకాకుళానికి 225 మంది ఎంపికయ్యారు. జిల్లా నుంచి ఆర్‌జీయూకేటీ విద్యాసంస్థకు 498 మంది ఎంపికయ్యారు. 12.33 శాతం విద్యార్థులు ఎంపిక కాగా, 26 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు ఎక్కువ మంది ఎంపిక కావటం గమనార్హం.
Tags
- RGUST Srikakulam Campus
- merit list
- tenth class marks
- Govt and Private Schools
- counselling
- certificate verification
- srikakulam campus
- Additionally assigned seats
- Admissions counselling
- Education News
- Sakshi Education News
- Etcherla Campus admissions 2024
- Srikakulam RGUST merit list 2024
- University admissions statistics
- Women admissions RGUST
- Men admissions Srikakulam
- Special category admissions RGUST