Anganwadi Centers: అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి కృషి
Sakshi Education
శివ్వంపేట(నర్సాపూర్): శిక్షణ పొందిన టీచర్లు అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి కృషి చేయాలని ఐసీడీఎస్ నర్సాపూర్ ప్రాజెక్ట్ సీడీపీఓ హేమభార్గవి పిలుపునిచ్చారు.
పూర్వప్రాథమిక విద్యపై మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణ ముగింపు సంద ర్భంగా ఆమె మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను కేంద్రాలలో ఆచరించి పిల్లలకు ఆట పాటలతో విద్యనేర్పాలని సూచించారు.
చదవండి: Time Management at Anganwadi : అంగన్వాడీల్లో సమయపాలన పాటించాలి.. ఈసీసీఈ డేలో..!
పిల్లలోని సృజనాత్మకతను వెలికి తీయాలని, కేంద్రాల నిర్వహణలో నిర్లక్షం చేయవద్దని చెప్పారు. కార్యక్ర మంలో మండల సూపర్‌వైజర్లు సంతోష, వసుమతి, నర్సాపూర్ ప్రాజెక్ట్ పరిధిలోని సూపర్‌వైజర్లు శశికళ, లక్ష్మి, సునీత, సక్కుబాయి, పోషణ అభియాన్ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Published date : 13 Jul 2024 09:44AM
Tags
- Anganwadi Centers
- Anganwadi Teachers
- CDPO Hemabhargavi
- Education
- Telangana News
- ICDS Narsapur project
- CDPO Hema Bhargavi speech
- Anganwadi center development
- Pre-primary education training
- Teacher Education Programme
- Early learning strategies
- Educational workshop
- Training outcomes
- sakshieducationlatest news