ఉన్నతవిద్య బలోపేతంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా వర్సిటీల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీపై కసరత్తు చేస్తోంది.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిబ్రవరి 16న సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎజెండా అంశాలు వెల్లడించకపోయినా ఉన్నతవిద్య బలోపేతం, యూనివర్సిటీల పరిధిలో ఉద్యోగఖాళీల భర్తీ అంశంపై మంత్రి చర్చించవచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి. సమావేశం అనంతరం నియామక ప్రక్రియపై ఓ స్పష్టత వచ్చే వీలుంది. యూనివర్సిటీల్లో దాదాపు 1,061 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్లతో పాటు పలు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.