Skip to main content

OU Exams: ఫిబ్రవరి 26 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు

OU Degree exams
OU Degree exams

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఫిబ్రవరి 26 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని సోమవారం కంట్రోలర్‌ ప్రొ.శ్రీనగేష్‌  తెలిపారు. ఫిబ్రవరి 26న డిగ్రీ  ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్‌  కోర్సుల 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 28న డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. కోవిడ్‌ కారణంగా గతంలో 2 గంటల వరకు కుదించిన సమయాన్ని ఇక నుంచి డిగ్రీతో పాటు ఇతర కోర్సులకు సైతం పాత సమయాన్ని 3 గంటల వరకు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఓయూలో పరీక్షల వాయిదా పడ్డాయంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. త్వరలో డిగ్రీ పరీక్షల టైం టేబుల్‌ను ఉస్మానియా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. 

Also read: Telangana: తెలంగాణ‌లోనైన 4 రోజులు సెల‌వులు ఇవ్వ‌రా..?

Published date : 15 Feb 2022 01:24PM

Photo Stories