Job Mela Breaking News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈనెల 11న జాబ్‌మేళా
Sakshi Education

వరంగల్ జిల్లా ఈస్ట్‌లో మంత్రి కొండా సురేఖ చొరవతో ఈ నెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు.నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు.జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.
పాలిసెట్ ఉచిత కోచింగ్: Click Here
ఇప్పటికే జాబ్ మేళాకు 60 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా మరో 40 నుంచి 50 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 8 వేలకుపైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నెల 11న ఉదయం 9.30 గంటల నుండి వరంగల్‌లోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్‌లో ప్రారంభం అవుతుందని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 10 Apr 2025 08:47AM