US Cancels Student Visas for Small Violations: అమెరికాలో స్టూడెంట్ వీసాలు రద్దు! అగ్రరాజ్యంలో అసలేం జరుగుతుంది?

ఎంతోమంది విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడం అనేది పెద్ద కల. మన దేశం నుంచి కూడా ప్రతి ఏడాది లక్షలాది మంది అమెరికాలో విద్యనభ్యసిస్తుంటారు. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అసలు వీసాలు రావడమే గగనం అయిపోతుంటే, వచ్చిన వీసాలను సైతం రద్దు చేస్తుంది ఆ దేశం.
భారత విద్యార్థులకు వీసా షాక్
ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 41 శాతం వీసాలను తిరస్కరించింది. వీటిలో భారత విద్యార్థుల వీసాలే 38 శాతం ఉన్నాయి. వీసాల తిరస్కరణకు కారణాలు కూడా చెప్పడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇజ్రాయిల్-గాజా యుద్ధ నేపథ్యంలో, హమాస్‌కు మద్దతుగా పోస్టులు పెట్టిన విద్యార్థులపై అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
అకస్మాత్తుగా వీసాల రద్దు..
హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యూసీఎల్ఏ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల వీసాలు అకస్మాత్తుగా రద్దుచేయడం గమనార్హం. ఇది విద్యార్థుల వ్యక్తిగత హక్కులపై దాడి చేయడమే అంటూ పలు మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తపరచినందుకే వీసాలు రద్దు చేయడం అనైతికం’’ అంటూ ఓ ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది తెలిపారు.
అంతేకాకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే,అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు శాతం పూర్తిగా దెబ్బతింటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు, వీసాలు రద్దైన విద్యార్థులు చట్టప్రకారం తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- USA student visa
- US visa cancellation news
- Visa issues for Indian students in USA
- US visa policy
- Trump visa decision
- Student visa revoked USA
- Social media posts and visa impact
- Visa problems for Indian students
- Study visa cancelled USA
- Cancelled US visa latest news
- Visa cancellation by US government
- Visa cancelled due to traffic violation
- Visa cancellation for social media posts
- Trump visa cancellation decision
- USA visa cancelled update