Skip to main content

ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం.. ఆ దేశం నుంచి స్పష్టత రాక ఆందోళన!

న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే కలలతో ఏర్పాట్లు చేసుకుంటున్న భారతీయ విద్యార్థులకు మరోసారి నిరాశ ఎదురవుతోంది. అమెరికా విద్యా వీసా (F1 Visa) ఇంటర్వ్యూలకు అవసరమైన ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌ స్లాట్లు హఠాత్తుగా కనిపించకుండా పోవడం విద్యార్థులను తీవ్రంగా కలవరపెట్టింది.
us visa appointment slots missing indian students 2025

ఏప్రిల్‌ నెల స్లాట్లు బుక్‌ అయిపోయాయి – మే, జూన్‌ కోసం ఎదురు చూపులు

గత 20–25 రోజులుగా వీసా స్లాట్లు దొరకడం గగనంగా మారింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన స్లాట్లు పూర్తిగా బుక్‌ కాగా, మే, జూన్‌ మాసాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్లు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదని విద్యార్థులు తెలిపారు. వీసా స్లాట్‌ బుకింగ్‌ లేకపోవడంతో అనేక మంది విద్యార్థుల అడ్మిషన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కారణం అర్థం కావడం లేదు – దుర్వినియోగ నిరోధానికి చర్యలు?

ఈ స్లాట్లు ఎందుకు కనిపించడం లేదో స్పష్టత లేక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. అయితే, యుఎస్‌ ఎంబసీ వీసా అపాయింట్‌మెంట్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేస్తుండటమే దీనికి కారణమై ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.

చదవండి:Study Abroad: స్టూడెంట్స్‌.. కెనడాకు వెళ్లాలంటే.. స‌రైన ర‌హ‌దారి ఇదే..! Canada వెళ్లాలంటే వీసాలు ఇవే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

వీసా బుకింగ్‌ లేకపోవడంతో విద్యార్థులు నిరాశ

ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూకు స్లాట్ బుకింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, చివరికి నిరాశే మిగులుతుంది. గడువు సమీపిస్తున్న కారణంగా కొంతమంది వర్సిటీ అడ్మిషన్లు వాయిదా వేసుకోవాలని కూడా భావిస్తున్నారు.

“భారతీయ విద్యార్థులకు పూర్తిగా సహకరిస్తాం” – రణధీర్ జైశ్వాల్‌
ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ స్పందిస్తూ, F1 వీసాలను రద్దు చేస్తున్నామంటూ వచ్చే వార్తలపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. భారతీయ విద్యార్థులకు అమెరికాలోని భారత ఎంబసీలు, కాన్సులేట్లు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Apr 2025 04:36PM

Photo Stories