Skip to main content

BRICS Summit: సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో.. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశం

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు.
Russian President Putin proposes bilateral meeting with PM Modi during BRICS summit October 22

ఈ నేపథ్యంలో సెప్టెంబ‌ర్ 12వ తేదీ అజిత్‌ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడని, రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్‌ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇటీవ‌ల‌ ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చల వివరాలను దోవల్‌ ఆయనకు వివరించారు.

‘బ్రిక్స్‌ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్‌ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.  వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్‌ నగరంలో బ్రిక్స్‌ శిఖరాగ్రం జరగనుంది.  అలాగే.. బ్రిక్స్‌ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ధ్రువీకరించారు. 

PM Modi: సింగపూర్‌లో మోదీ రెండు రోజుల పర్యటన.. ప్రధాని లారెన్స్‌తో ద్వైపాక్షిక చర్చలు

Published date : 13 Sep 2024 03:08PM

Photo Stories