Physical Test for SI Posts: ఎస్‌ఐ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షల నిర్వాహణ
సాక్షి ఎడ్యుకేషన్: వర్షాలతో ఆగిపోయిన ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. రాయలసీమ జోన్‌కు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన ఎస్‌ఐ అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్‌పీ 2వ బెటాలియన్‌లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం తొమ్మిదో రోజు 800 మంది అభ్యర్థులకుగాను 572 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం, ఎత్తు, ఛాతీ కొలతలు తీసుకున్నారు. అనంతరం 1,600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. 1,600 మీటర్ల పరుగు పరీక్షల్లో 461 మంది అభ్యర్థులు పాల్గొనగా 404 మంది అర్హత సాధించారు. 100 మీటర్ల పరుగు పరీక్షల్లో పాల్గొన్న 404 మంది అభ్యర్థుల్లో 250 మంది అర్హత సాధించారు.
Schools for Tribals and Villages: గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల నిర్మాణం
లాంగ్ జంప్‌లో 404 మంది పాల్గొనగా 343 మంది అర్హత సాధించారు. ఎస్‌ఐ మెయిన్స్ పరీక్షలకు తొమ్మిదో రోజు 345 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పోలీసు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దేహదారుఢ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్‌కుమార్, ఎస్పీ కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌లు పర్యవేక్షించారు. దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు ఒరిజనల్ మార్కుల లిస్టులతో పాటు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన మూడు సెట్ల జిరాక్స్ ప్రతులు కచ్చితంగా వెంట తీసుకురావాలని పోలీస్ అధికారులు తెలిపారు.
ఎస్‌ఐ మెయిన్ పరీక్షకు తొమ్మిదో రోజు 345 మంది ఎంపిక