Skip to main content

ఐడీబీఐ బ్యాంకు ఎస్‌వో పోస్టుల వేతనాలు.. ఎంపిక విధానం ఇలా..

డిప్యూటీ జనరల్ మేనేజర్(గ్రేడ్ డీ) పోస్టులకు రూ.50030-రూ59170 వరకు వేతనంగా అందు తుంది.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్ సీ) రూ.42020-రూ.51490 పొందుతారు. మేనేజర్ (గ్రేడ్-బీ) స్థాయి అధికారులకు రూ. 31705- రూ.45950వరకు ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్లకు (గ్రేడ్-ఏ) రూ.23700-రూ.42020 వరకు వేతనంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం..
ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తుల్లోని విద్యార్హతలు, పని అనుభవం, ఇతర వివరాల ఆధా రంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ లకు పిలుస్తారు. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థుల కు నిబంధనల ప్రకారం మెడికల్ టెస్టులను నిర్వహిం చి.. ఆయా ఉద్యోగాల్లో నియామకం ఖరారు చేస్తారు.

దరఖాస్తు , ఫీజు..
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు రూ.700(అప్లికేషన్+ ఇంటిమేషన్ చార్జీలు కలిపి), ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.150 (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే) ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి: part 1: పరీక్ష లేకుండానే ఐడీబీఐ బ్యాంకు కొలువు.. అర్హత వివరాలు తెలుసుకోండిలా..
Published date : 31 Dec 2020 12:43PM

Photo Stories