Skip to main content

బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..

విద్యుత్ రంగంలో ఉద్యోగాలు సంపాదించాల నుకునే వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ) బ్రాంచ్ చక్కటి మార్గంగా చెప్పవచ్చు.
 భవిష్యత్తుకు భరోసాను ఇస్తున్న బ్రాంచ్‌ల్లో ఈఈఈ ఒకటి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీ వంటి వాటితోపాటు ఎలక్ట్రికల్ పరికరాల డిజైనింగ్, తయారీ, టెస్టింగ్..  ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ల ప్రధాన విధులు. భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించే రంగాల్లో పవర్ రంగం ఒకటి. ఈఈఈ బ్రాంచ్‌ని ఎంపిక చేసుకో వాలనుకునే విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టు లపై మంచి పట్టుండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈఈఈలో చేరడం ద్వారా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్  రంగాల్లో రాణించవచ్చు.
 
 ఏం చేస్తారు : ఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్  సంబంధిత రంగాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ మెమొరీ స్టోరేజ్ డివైజ్‌లు, సీఎన్‌సీ మెషిన్ సర్క్యూట్లు, ఇండస్ట్రియల్ రోబోట్స్‌ను ఈఈఈ ఇంజనీర్లే రూపకల్పన చేస్తారు. కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, రెడియో ఫ్రీక్వెన్సీ డిజైన్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, పవర్ జనరే షన్, విద్యుత్ యంత్రాలకు సంబంధించిన అనుబంధ విధులను కూడా వీరు నిర్వర్తిస్తారు.  ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, కంప్యూటర్ వంటి వాటి భాగాలను తయారు చేయడం, వాటిని డిజైన్ చేయడం వంటివి కూడా చేస్తారు.
 ఉన్నత విద్య: ఈఈఈ బ్రాంచీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోను ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.   ఎంఈ/ఎంటెక్ కోర్సులు చేయాలనలకునే వారు అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్‌లో  చేరొచ్చు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాల నుకునే వారికి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్‌లో ఎంఎస్ చేయడానికి వీలుంది.
 
 ఉద్యోగావకాశాలు..
 ఎలక్ట్రికల్  అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి  చేసిన అభ్యర్థులకు కెరీర్ పరంగా మంచి అవకా శాలు ఉన్నాయి.  పవర్ జనరేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీ కమ్యూనికేషన్, కంప్యూటర్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, బయో మెడికల్  రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. ఇవే కాకుండా పవర్ ప్లాంట్‌లు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషనల్లో పవర్ డిస్ట్రి బ్యూషన్ విభాగాల్లో సైతం కొలువులను సంపా దించవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, చీఫ్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రిలయబిలిటీ ఇంజనీర్, డెవలప్‌మెంట్ ఇంజనీర్, సిస్టమ్ డిజైన్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ సహా వివిధ అనుబంధ విభాగాల్లో వీరిని నియమిం చుకుంటారు. ఇవే కాకుండా బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, సెయిల్, కోల్ ఇండియా లిమిటెడ్ తదితర సంస్థలు ఈఈఈ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి.
Published date : 22 Oct 2020 06:30PM