Sports for Students: క్రీడా జీవితంలో విద్యార్థుల సత్తా చాటాలి
![Chair person Sardar Ravinder Singh lighting the sports candle](/sites/default/files/images/2023/09/26/sports-meet-1695726530.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని, క్రీడలతో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రేకుర్తిలోని లయోలా మైదానంలో సోమవారం తెలంగాణ స్టేట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) 2వ జిల్లా స్పోర్ట్స్ మీట్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బారాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దృఢత్వం, ప్రశాంతత లభిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడల పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తోందని తెలిపారు.
Kasturba Gandhi School: విద్యార్థినుల అర్ధాకలి
సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రాథమిక దశ నుంచే విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపడం వల్ల చెడు మార్గాలకు దూరమవుతారని, తద్వారా బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చునన్నారు. ప్రిన్సిపల్ మోనిక సోని ఆధ్వర్యంలో జరిగిన ఈ స్పోర్ట్స్ మీట్‌లో డీఐవో దామోదర్‌రెడ్డి, ఆర్‌ఎల్‌సీలు కె.సురేశ్, సయ్యద్ హమీద్, విజిలెన్స్ ఆఫీసర్ షౌకత్ అలీ, లయోలా కరస్పాండెంట్ సన్నాన స్వామి, ప్రిన్సిపాల్ ఫాదర్ జోసెఫ్, సెయింట్ జార్జ్ స్కూల్ చైర్మన్ డా.పి.ఫాతిమా రెడ్డి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.