Skip to main content

ICC Development Awards: క్రికెట్‌ అభివృద్ధికి చొరవ చూపిన ఆరు దేశాల‌కు అవార్డు

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) క్రికెట్‌ అభివృద్ధికి చొరవ చూపినందుకు, 2023 సంవ‌త్స‌రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆరు అసోసియేట్‌ సభ్య దేశాలను "డెవలెప్‌మెంట్‌ అవార్డుల"తో గౌరవించింది.
List of 21 countries nominated for the ICC Development Awards 2023 ICC Development Awards  CC Development Awards Ceremony showcasing the six honored associate member nations  Inspiring initiatives honoured as Global winners of ICC Development Awards revealed

ఒమన్: వంద శాతం మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించినందుకు.
నెదర్లాండ్స్: పురుషుల క్రికెట్‌లో 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు మరియు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించినందుకు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE): మహిళల క్రికెట్‌లో 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు.
నేపాల్: డిజిటల్‌ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకోవడంలో సఫలమైనందుకు.
స్కాట్లాండ్: క్రికెట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు.
మెక్సికో: జైలులో ఖైదీలకు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినందుకు.

మొత్తం 21 దేశాలు ఈ అవార్డులకు నామినేట్ కాగా.. ఐసీసీ ప్యానెల్ ఈ ఆరు దేశాలను ఎంపిక చేసింది.

British Grand Prix: ఒకే సర్క్యూట్‌పై తొమ్మిదిసార్లు విజేతగా నిలిచిన డ్రైవర్ ఈయ‌నే..

Published date : 19 Jul 2024 09:23AM

Photo Stories