Skip to main content

Pollution Deaths: భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి

Pollution killed 23 Lakh Indians in 2019
Pollution killed 23 Lakh Indians in 2019

Telugu Current Affairs - National: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం(16.7లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని.. వీటిలో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకంటే తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్‌ చెప్పారు. 

Union Cabinet: జాతీయ జీవ ఇంధన విధానానికి సవరణలు

Published date : 30 May 2022 07:35PM

Photo Stories