Guidelines for Designation of Senior Advocates: న్యాయవాదుల హోదాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
![Guidelines for Designation of Senior Advocates, Senior Advocate, Regular Lawyer](/sites/default/files/images/2023/10/24/lawer-1698143509.jpg)
ఈ విషయంపై గతంలో పిటిషన్ దాఖలైంది. లాయర్‌కు సీనియర్ పోస్టు ఇవ్వడాన్ని అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023, అక్టోబర్ 19న మొత్తం 535 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించారు. ఇంతకీ సీనియర్ న్యాయవాది అని ఎవరిని పిలుస్తారు? ఇందుకుగల అర్హతలు, నిబంధనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Abortion rules and Laws: అబార్షన్‌లపై భిన్నాభిప్రాయాలు
అడ్వకేట్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం న్యాయవాదులు రెండు తరగతులకు చెందినవారై ఉంటారు. మొదటిది సీనియర్ న్యాయవాది. రెండవ ఇతర న్యాయవాది. ఒక న్యాయవాది సీనియర్ కావాలనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ హోదాను అందించవచ్చు. సెక్షన్ 23 (5) ప్రకారం కేసును దాఖలు చేసే హక్కు సీనియర్ న్యాయవాదులకు ఉండదు. వారు ఆయా కేసులను పరిష్కరించడమో లేదా కేసును క్రాస్ ఎగ్జామిన్ చేయడమో చేస్తారు. సాధారణ న్యాయవాదులతో పోలిస్తే సీనియర్ న్యాయవాది కేసు దాఖలు చేసే అధికారాన్ని కోల్పోతాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే పలు కేసుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు ఈ లాయర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది.
Supreme rejects same-sex marriage: స్వలింగ వివాహాల చట్టబద్ధతను నిరాకరించిన సుప్రీం
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రాను సీనియర్ లాయర్ హోదా పొందేందుకు వయసుకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయా అని అడగా, దీనికి వయోపరిమితి లేదని బదులిచ్చారు. అయితే ఆ న్యాయవాది ఎన్ని కేసులలో వాదించాడు? అవి ఎలాంటి కేసులు, కేసులలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సీనియర్ హోదా పొందడానికి ముందుగా ఎవరైనా న్యాయవాది హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారి దరఖాస్తులను పరిశీలించి, జాబితాను విడుదల చేస్తారు. తాజాగా 535 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పించింది. కోర్టు వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా సందర్భంలో వారి సలహా తీసుకుంటుంది.