Skip to main content

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా ఒడిఒడిగా అడుగులు... జ‌మిలి ఎన్నిక‌లు సాకార‌మ‌య్యేనా..?

కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ప‌లు సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ వ‌స్తోంది.
Jamili Elections, NDA Government in Action, Policy Decisions, Majority Government
జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా ఒడిఒడిగా అడుగులు... జ‌మిలి ఎన్నిక‌లు సాకార‌మ‌య్యేనా..?

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: మొద‌టి ద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నోట్ల ర‌ద్దుతో దేశాన్ని విస్మ‌యానికి గురిచేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఒకే ప‌న్నువిధానం ఉండాల‌ని నిర్ణ‌యిస్తూ జీఎస్టీ అమ‌లుచేసింది. అలాగే ఆర్టిక‌ల్‌ 370 ర‌ద్దు, ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమ‌లు, ప్ర‌భుత్వ బ్యాంకుల విలీనం... ఇలాంటి చారిత్ర‌క నిర్ణ‌యాలను అమ‌లు చేసింది. తాజాగా పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను 5 రోజులపాటు ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తామ‌ని కేంద్రం చెప్ప‌డంతో మ‌ళ్లీ జ‌మిలి ఎన్నిక‌ల ఊహాగానాలు ఊపందుకున్నాయి.

jamili elections

వీటికోవ‌లోకే జ‌మిలి ఎన్నిక‌లను తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా యోచిస్తోంది. జ‌మిలి ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గ‌త కొన్నేళ్లుగా వ్యాఖ్య‌లు చేస్తూనే వ‌స్తున్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నిక విధానం అమ‌లులో ఉన్న‌ప్పుడే దేశం పురోగమిస్తుందని, దీన్ని సాకారం చేయాల్సిన అవసరముందని మోదీ వ్యాఖ్య‌ల ముఖ్యోద్దేశం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే మ‌ళ్లీ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఊపందుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇందుకు సంబంధించి రాజ‌కీయ పార్టీ నాయ‌కుల‌తో కేంద్రంలోని పెద్ద‌లు చ‌ర్చించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

చ‌ద‌వండి: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు 

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన ఇండియా వంటి దేశంలో ఎన్నిక‌లే ఊపిరి. అలాంటి కీలకమైన ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జమిలిపై చర్చ వచ్చిన నాటి నుంచి ఎన్నో విశ్లేషణలు, వాదనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న ప్రక్రియను కాదని కొత్త విధానం తీసుకు రావాలని భావించినప్పుడు ప్రశ్నలు ఎదురవటం సహజం. అసలు జమిలి ఎన్నికల అవసరమేంటి..? ప్రస్తుతమున్న ఎన్నికల ప్రక్రియలో అంతగా లోపాలు ఏమున్నాయి..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

jamili elections

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారి 1951-52 మ‌ధ్య దేశ‌వ్యాప్తంగా రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల‌కు, లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత 1957, 1962, 1967లలో అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలు ముందే రద్దు కావడంతో వాటికి విడిగా ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో జమిలికి అంతరాయం కలిగింది. ఇక అప్ప‌టినుంచి నేటి వ‌ర‌కు దేశంలో ఒక్కోరాష్ట్రానికి ఒక్కోసారి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. లోక్‌స‌భ‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే కోట్ల విలువైన ప్ర‌జాధ‌నం ఆదా చేయవచ్చని నిపుణుల అభిప్రాయం.  

చ‌ద‌వండి:  నెట్టింట వైర‌ల‌వుతున్న ఆటోవాలా ఇన్ఫిరేష‌న్ జ‌ర్నీ... ఎందుకో మీరు ఓ లుక్కేయండి.!

జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ యంత్రాంగంపైనా పని భారం తప్పుతుందని, ఖజానాకు ఖర్చు తగ్గుతుందని, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకూ ప్రచార వ్యయ ప్రయాసలూ తగ్గిపోతాయ‌న్న విశ్లేష‌ణ‌లూ వినిపిస్తున్నాయి. ప్ర‌తీ ఏటా ఏదొక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల సాధారణ ప్రజా జీవనం దెబ్బతింటుందని, నిత్యావసర సేవలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు లేక‌పోలేదు. 

గత మూడు దశాబ్దాల్లో లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలు జరగని ఏడాది ఒక్కటైనా లేదు. నిత్యం ఏదో ఒకచోట ఎన్నిక‌లు జ‌రుగుతూ ఉన్నాయి. దీంతో ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతోంది. ఎన్నికల వ్యూహాలు, గెలుపుపై దృష్టి సారించే క్రమంలో- అభివృద్ధి పనులపై పాలక పక్షాలు పెద్దగా మనసు పెట్టలేవు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలు తీసుకోవ‌డం ఆల‌స్య మ‌వుతోంది. ఫ‌లితంగా ఇది అభివ‌`ద్ధి ప‌నుల‌పై ప‌డుతోంది. 

jamili elections

ఉదాహ‌ర‌ణ‌కు ఈ ఏడాదే చూసుకుంటే... ఈశాన్య రాష్ట్రాల్లో ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్‌-మేలో కర్ణాటక, నవంబరు-డిసెంబరులో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, మ‌ణిపూర్‌లో ఎన్నికలు జ‌ర‌గనున్నాయి. గ‌త ఎనిమిదేళ్ల‌లో రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం రూ.7,500 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కిరెన్‌ రిజిజు గ‌తేడాది పార్ల‌మెంట్ సాక్షిగా వెల్ల‌డించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో 55 వేల కోట్ల రూపాయల మేర ఖర్చయిందని, ప్రపంచ దేశాల ఎన్నికల వ్యయాల్లో అప్పటికి అదే గరిష్ట‌మని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అధ్యయనం లెక్క తేల్చింది. 

చ‌ద‌వండి: 36 ల‌క్ష‌ల వేత‌నాన్ని వ‌దిలేసి సివిల్స్ వైపు అడుగులు... వ‌రుస‌గా మూడు ప్ర‌య‌త్నాల్లో ఫెయిల్‌... చివ‌రికి స‌క్సెస్ సాధించానిలా

జ‌మిలి ఎన్నిక‌లు సాకార‌మైన ప‌క్షంలో ఓటరు ఒకేసారి జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలకులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలు అవసరమంటూ న్యాయ కమిషన్‌ 2018లో కేంద్రానికి సూచించింది. 

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయస్థాయి అంశాలకు దక్కేంత ప్రాధాన్యం ప్రాంతీయ అంశాల‌కు లభించదని ప్రాంతీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయిదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలంటే ఓట్ల త‌తంగం ముగిసిన తరవాత రాజకీయ పార్టీలు ప్రజల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ప్రమాదముందనే అభిప్రాయాలు లేక‌పోలేదు. 

jamili elections

జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా అప్పటికే అసెంబ్లీ గడువు తీరిన రాష్ట్రాల్లో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. జ‌మిలి ఎన్నికల తరవాత రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయినా మ‌ళ్లీ జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించే వ‌ర‌కు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన దుస్థితి తలెత్తుతుంది. అలా రాష్ట్రాలు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఒక‌వేళ కేంద్రంలో అతుకుల బొంత లాంటి ప్రభుత్వాలు ఏర్ప‌డి.. అవి కొద్ది కాలానికే కూలిపోతే త‌ర్వాత ఏంటి ప‌రిస్థితి అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ప‌డిపోయినప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం త‌న‌ అధికారాల‌తో రాష్ట్రపతి పాలన పెడుతుంది. అదే కేంద్రంలోని ప్ర‌భుత్వ‌మే మూణ్నాళ్ల ముచ్చ‌ట‌లా మారితే..? 

చ‌ద‌వండి: మ‌రో 15 రోజుల వ‌ర‌కే ఫ్రీ... ఆధార్‌ను ఇలా ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..!

ఉదాహ‌ర‌ణ‌కు మ‌హారాష్ట్ర‌ను తీసుకుంటే.. గ‌త మూడేళ్ల‌లో అక్క‌డ మూడు ప్ర‌భుత్వాలు మారాయి. ఎన్నిక‌ల్లో సింగిలి లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన బీజేపీ.. ఎన్సీపీలోని కొంత‌మంది ఎమ్మెల్యేల సాయంతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కానీ, అది కొద్ది గంట‌ల్లోనే కుప్ప‌కూలింది. త‌ర్వాత శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీ ఉమ్మ‌డిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేశాయి. పాల‌న స‌క్ర‌మంగా సాగుతోంది అన్న క్ర‌మంలో శివ‌సేన చీలి బీజేపీ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసింది. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ కాంగ్రెస్‌ను కూల‌దోసి బీజేపీ అధికారం చేప‌ట్టింది. క‌ర్నాట‌క‌లోనూ కాంగ్రెస్‌, జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి బీజేపీ అధికారం చేప‌ట్టింది. 

PM Modi

అంత ఈజీ అయితే కాదు..!
ఈ బిల్లు పాస్‌ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు లోక్‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67శాతం అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్రవేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన నిలవాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: చ‌దువుల్లో రారాజులు... చంద్ర‌యాన్ 3లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల విద్యార్హ‌త‌లు ఇవే..!

ప్రస్తుతం భాజపా 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. దానికి మద్దతు ఇచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. ఎన్‌డీఏకు లోక్‌భలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61శాతానికి సమానం. మరో 5శాతం ఓటింగ్‌ను సంపాదించడం దానికి కష్టమే. రాజ్యసభలో కేవలం 38శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి.

కేంద్రంలో ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చుట్టే రాష్ట్ర రాజ‌కీయాలు తిరిగే ప్ర‌మాదం ఉంది. వ్య‌య‌ప్ర‌సాల‌కు ఓర్చి జ‌మిలి ఎన్నిక‌లను మొండిగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చినా ఇది ఎన్నిరోజులు కొన‌సాగుతుందో ఎవ‌రికీ అంతుప‌ట్ట‌ని మిథ్య‌లా మిగిలిపోయే ప్ర‌మాదమూ లేక‌పోలేదు..! 

Published date : 02 Sep 2023 09:14AM

Photo Stories